Begin typing your search above and press return to search.

అధికారం పోయింది.. టీడీపీ నేతలు పోయారు

By:  Tupaki Desk   |   30 July 2020 10:15 AM IST
అధికారం పోయింది.. టీడీపీ నేతలు పోయారు
X
అధికారం బెల్లం లాంటిది. అది ఉన్నప్పుడే బెల్లం చుట్టూ ఈగలు.. నేతల చుట్టు జనాలు చేరుతారు. ఇప్పుడు అధికారం పోయేసరికి నేతలంతా జనాలకు దూరంగా వెళ్లిపోతారు. తమ దారి తాము చూసుకుంటారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా నేతలకు అత్యధిక పదవులు దక్కాయి. చంద్రబాబు ఈ జిల్లాకు ఇచ్చినన్ని పదవులు ఏ జిల్లాకు ఇవ్వలేదు.మంత్రి పదవులు, మండలి చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు.. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇలా ఎన్నో జిల్లా నేతలకు వరించాయి. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీలో చేరిపోయారు.

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ జిల్లాలో కుదేలైంది. ఒక్కటంటే ఒక్క సీటూ గెలవలేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టీడీపీ మహానాడుకు కూడా హాజరు కాలేదు. పార్టీ ఆఫీసువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం జిల్లా ప్రజాసమస్యలపై గొంతెత్తే నాథుడే లేకుండా పోయాడు. జిల్లాలో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అస్సలు కనిపించడం లేదు.

ఇటీవల కర్నూలు జిల్లాలో ఆక్సిజన్ అందక 19మంది చనిపోయినా ప్రతిపక్ష టీడీపీ నేతలు నోరెత్తకపోవడం టీడీపీ క్యాడర్ లో నిరుత్సాహాన్ని నింపింది. ఇలా అధికారం పోతే నాయకులంతా కనుమరుగు కావడం ఆ పార్టీని జిల్లాలో తీవ్రంగా దెబ్బతీస్తోంది.