Begin typing your search above and press return to search.

ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేకు ఆహ్వానాలు అంద‌డం లేదా? రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   21 Dec 2021 11:56 PM IST
ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేకు ఆహ్వానాలు అంద‌డం లేదా?  రీజ‌నేంటి?
X
నోరు మంచిదైతే.. ఊరు మంచిద‌వుతుంద‌ని.. సామెత‌! ఇది ఎలాంటి వారి విష‌యంలో అయినా.. అన్వ యం అవుతుంది. అధికారం ఉంద‌ని.. లేద‌ని సంబంధం లేకుండా.. నోరు మంచిదైతే.. అంద‌రూ మ‌చ్చిక వుతారు.

కానీ,నోరు విప్పిందే త‌డ‌వుగా.. బూతుల‌తో విరుచుకుప‌డితే.. అన‌రాని, విన‌లేని మాట‌లు అనే స్తూ.. కేవ‌లం మీడియాలో ఫాలోయింగ్ కోస‌మే.. అధినేత మ‌చ్చిక కోస‌మే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఎవ‌రు మాత్రం స‌హిస్తారు? ఎన్నాళ్ల‌ని భ‌రిస్తారు? ఇదే ఇప్పుడు ఓ మంత్రివ‌ర్యుల విష‌యంలోను.. ఓ ఎమ్మెల్యే విష‌యంలోనూ.. జ‌రుగుతోంద‌ట‌!!

ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ జ‌రుగుతోంది. రాష్ట్రం రాజ‌కీ యంగా మంచి గుర్తింపు ఉన్న ఒక సామాజిక వ‌ర్గంలోని పెద్ద పెద్ద వారి ఇళ్ల‌లో పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి.

దీంతో రాజ‌కీయంగా ప‌లుకుబడి ఉన్న ఆయా కుటుంబాలు.. నేత‌ల‌ను సాద‌రంగా ఆహ్వానిస్తున్నాయి. పైగా.. కొన్ని పెళ్లిళ్లు ఏకంగా కృష్నాజిల్లాలోను.. ఈ జిల్లాకుచెందిన కుటుంబాల వారు హైద‌రాబాద్‌, విశాఖ వంటి చోట్ల చేసుకుంటున్నారు. అయితే.. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంతో మందిని వివాహానికి ఆహ్వానిస్తున్నా.. వైసీపీకి చెందిన ఓ ఇద్ద‌రికి మాత్రం ఆహ్వానం అంద‌డం లేదు.

పోనీ..వారే మ‌న్నా.. త‌మ సామాజిక వ‌ర్గం కాదా.. అంటే.. అదే సామాజిక వ‌ర్గం. పైగా.. అట్ట‌హాసానికి ఆడంబ రానికి ఈ సామాజిక వ‌ర్గం పెట్టింది పేరు. అలాంటి వివాహాల‌కు కూడా వైసీపీకి చెందిన ఓ మంత్రికి ఎలాంటి ఆహ్వానాలు అంద‌డం లేదు.

ఇక‌, ఇదే పార్టీకి మ‌ద్ద‌తిస్తున్న ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో ఎమ్మెల్యేను కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఇదే విష‌యం చ‌ర్చ నీయాంశంగా మారింది. పైన చెప్పుకొన్న‌ట్టు.. వీరి నోరు మంచిది కాద‌ని.. అందుకే పిల‌వ‌డం లేద‌ని.. అంటున్నారు నెటిజ‌న్లు.

ఒక మంత్రిగా రు నోరువిప్పితే.. ఎన‌లేని ..... ప‌రంప‌ర సాగుతుంద‌ని అంటున్నారు. మ‌రో ఎమ్మెల్యే నోరు విప్పితే.. కుటుంబాలు ఒక‌చోట కూర్చుని విన‌లేని మాటలు.. సంబంధాలు.. అంట‌గ‌ట్టేస్తున్నార‌ని .. అందుకే ఇలాంటివారిని సంప్ర‌దాయంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంచాల‌ని ఆ సామాజిక వ‌ర్గం నిర్ణ‌యించి ఉంటుంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. సో.. ఏదేమైనా.. నోరు మంచిది కాక‌పోతే.. ఇలానే జ‌రుగుతుంద‌ని.. అంటున్నారు.