Begin typing your search above and press return to search.

అమెరికా-చైనా వార్.. ఇండియాకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   30 Aug 2019 9:37 AM GMT
అమెరికా-చైనా వార్.. ఇండియాకు గుడ్ న్యూస్
X
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం.. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ ఇప్పుడు భారత్ వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పతకాస్థాయికి చేరింది. అమెరికా కేంద్రంగా నడిచే యాపిల్ సంస్థ చైనాలోనే తమ మొబైల్ ఫోన్ల తయారీ - పరిశ్రమలను నెలకొల్పి అక్కడే పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తోంది.

చైనాపై అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు చైనాకు ప్రత్యామ్మాయంగా భారత్ వైపు యాపిల్ అడుగులు వేస్తోంది. తాజాగా అమెరికా-చైనా ట్రేడ్ వార్ తో అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రధాని మోడీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనలను సడలించారు.

దీంతో చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడి - అమ్మకాలు సాగిస్తున్న యాపిల్ తాజాగా దేశవ్యాప్తంగా రిటైట్ స్టోర్ లతోపాటు ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల్లోనే ముంబైలో తొలి రిటైల్ కేంద్రం ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. తొలుత ‘యాపిల్ ఆన్ లైన్ స్టోర్’ను ప్రారంభించనుంది. ఆ తర్వాత దేశంలో యాపిల్ ఫోన్లను తక్కువ ధరకే అమ్మడానికి యాపిల్ సిద్ధమైంది. కంపెనీ ఉత్పత్తి - అమ్మకాలు ఇండియాలో ప్రారంభిస్తే యాపిల్ ఫోన్లు మరింత తక్కువకే భారతీయులకు లభించనున్నాయి.

ఇప్పటిదాకా యాపిల్ కు చైనా మార్కెటే కీలకం. అక్కడే తయారీ - అమ్మకాలు ఎక్కువ. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఆంక్షల నేపథ్యంలో భారత్ వైపు యాపిల్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు యాపిల్ భారతదేశంలో నేరుగా అమ్మకాలు చేయలేదు. ఫ్లిప్ కార్ట్ - అమెజాన్ ఇతర సంస్థల ద్వారా ఫోన్లు అమ్మేది. ఇప్పుడు నేరుగా భారతీయ మార్కెట్లోకి దిగుతోంది.

ఇక భారత్ ఎఫ్.డీ.ఐ నిబంధనల సడలింపుతో యాపిలే కాదు ఫోక్సోన్ - విస్ట్రన్ కార్ప్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా భారత్ లో తమ సంస్థల ఏర్పాటుకు ముందుకువచ్చాయి. దీంతో చైనాను వెనక్కి నెట్టి భారత్ ఇప్పుడు వాణిజ్య రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటుండడం విశేషం.