Begin typing your search above and press return to search.

పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన లేదు : ఇంటర్‌ బోర్డు!

By:  Tupaki Desk   |   27 March 2021 5:50 AM GMT
పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన లేదు : ఇంటర్‌ బోర్డు!
X
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర స్థాయిలో పడింది. ముఖ్యంగా విద్యారంగం పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. గత ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ ఆన్ లైన్ క్లాస్ లు , ఆ తర్వాత ఇటీవలే స్కూల్స్,కాలేజీలు తెరచారు. అయితే మళ్ళీ అక్కడ భారీగా కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణాలో విద్యాసంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఇంటర్ పరీక్షలు ఉంటాయా, ఉండవా, అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు స్పందించింది. పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు చెబుతున్నారు. మే 1నుంచి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు త్వరలో హాల్ టికెట్లు జారీ చేయనున్నామని చెప్పారు. ఇక ఏప్రిల్ 1, 3 వ తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ల రూపంలో నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం కాలేజీలు మూసి ఉన్నందున వీటిని ఇంటి నుంచే రాసె వెసులుబాటు కల్పించనున్నామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు. ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.