Begin typing your search above and press return to search.

కరోనా కొత్త వేరియంట్లతో నో ఫియర్ !

By:  Tupaki Desk   |   24 Oct 2021 12:30 AM GMT
కరోనా కొత్త వేరియంట్లతో నో ఫియర్ !
X
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.

కరోనా తొలివేవ్ ను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల్లో కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో మరణాల సంఖ్య తక్కువగానే కన్పించింది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాధారణ పరిస్థితి రావడానికి చాలానే సమయం పట్టింది. ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది. కరోనా రెండో దశలో డెల్టా ప్లస్ వైరస్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారంతో సీసీఎంబీ కరోనా వైరస్ ల ఆర్ఎన్ఏ జన్యు పరిణామ క్రమంపై నిరంతరం పరిశోధనలను చేపడుతోంది.

అయితే కొత్త వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉందని, థర్డ్ ముంపు ఉందని వస్తున్న వార్తలపై తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్, సలహాదారు రాకేష్ మిశ్రా స్పందించారు. తమ సంస్థ జరుపుతున్న జోనోమ్ సీక్వెనింగ్ పరీక్షల్లో సద్వేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే డెల్టా వేరియంట్లోనే సబ్ వేరియంట్లు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు. డేల్టా వేరియంట్లలో ఏవై4, ఏవై-33, ఏవై-27 వంటి రకాలు కన్పిస్తున్నాయని తెలిపారు. కానీ వీటి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. వాస్తవానికి విదేశాల్లో డెల్లా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు. మనదేశంలో ఎక్కువగా ఉండన్నారు. బెంగుళూరు తదితర నగరాల్లో సీవరేజి వాటర్ తోపాటు ఇతర నమునాలను పరిశీలించినపుడు కరోనా వ్యాప్తి తగ్గినట్లు తేలిందన్నారు

దేశంలో కొత్తగా 16,326 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనాతో 666 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,73,728 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న‌ 17,677 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,35,32,126కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,53,708కు పెరిగింది. నిన్న‌ 68,48,417 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దీంతో ఇప్పటివరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,01,30,28,411 కు చేరింది.