Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎన్నాళ్లు.. అందరిలోనూ భయం

By:  Tupaki Desk   |   1 April 2020 7:00 AM IST
లాక్ డౌన్ ఎన్నాళ్లు.. అందరిలోనూ భయం
X
కరోనా వైరస్ ను దేశంలో నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ దేశంలో లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఎవరూ అడుగు బయటపెట్టవద్దని సూచించారు. 21 రోజుల పాటు ఏప్రిల్ 15వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. అన్నింటిని బంద్ చేశారు.. దేశ ప్రజలకు భారీ ప్యాకేజీ అందజేసింది. అయితే ఇది మరికొంత కాలం పొడిగించడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. దీనిపై అనేకమందికి అనుమానాలు కలుగుతున్నాయి.

దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పొడిగింపు వార్తలను కొట్టిపారేసింది. మీడియాతోపాటు సోషల్ మీడియాలో లాక్ డౌన్ పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. ఇప్పటికైతే లాక్ డౌన్ పొడిగించే ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చారు. పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని తెలిపారు.

అయితే దేశంలో బ్యాంకులు, అప్పులు, రుణాల చెల్లింపులపై మూడు నెలల పాటు మారటోరియం ఎందుకు విధిస్తారని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణాళికలో భాగంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేసిందంటున్నారు. 3 నెలలు అంటే ప్రజలు భయపడుతారనే ఇలా 21 రోజులు పెట్టారని.. దీన్ని మళ్లీ పొడిగిస్తారనే ఊహాగానలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రం క్లారిటీ ఇచ్చినా ప్రజల్లో మాత్రం భయాలు తొలగడం లేదు. కానీ మూడు నెలలు విధిస్తే మాత్రం ప్రజలకు ఎలాంటి సంపాదన లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.