Begin typing your search above and press return to search.
ఆ దేశాలకు వెళ్లారో ... మూడేళ్లు సౌదీలోకి నో ఎంట్రీ !
By: Tupaki Desk | 28 July 2021 1:00 PM ISTకరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కొత్త కొత్త వేరియంట్ల వ్యాప్తి ని అరికట్టేందుకు సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇండియా తో పాటుగా సౌదీ ప్రకటించిన రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలకు వెళ్లే ప్రయాణికులు తిరిగి సౌదీలో ప్రవేశించకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది కరోనా మహమ్మారి నుంచి మొదటిసారిగా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా మేలో విదేశాలకు అనుమతించిన కొందరు సౌదీ పౌరులు ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికారి వెల్లడించారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపితమైతే తిరిగి దేశానికి తిరిగి వచ్చాక భారీ జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురవుతారని కీలక ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియా ‘రెడ్ లిస్ట్’ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, లెబనాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా తదితర దేశాలున్నాయి. ఆయా దేశాలకు ప్రయాణాలను సౌదీ నిషేధించింది. 30 మిలియన్ల జనాభా ఉన్న ఈ గల్ఫ్ దేశంలో మంగళవారం కొత్తగా 1,379 కొత్త కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,20,774కు పెరగ్గా.. మృతుల సంఖ్య 8,819కు పెరిగింది.
ఇక ఇదిలా ఉంటే కరోనా విజృంభణ మొదలుకావడానికి కొన్ని రోజుల ముందే సౌదీ చరిత్రలోనే తొలిసారిగా టూరిస్ట్ వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సమయంలో అక్కడికి వచ్చే విదేశీయులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం,బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం వంటి వాటిపై నిషేధం విధించింది. మహిళలు తప్పనిసరిగా తమ భుజాలను,మోకాళ్లను కవర్ చేసుకునేలా దుస్తులు ధరించాలని , ఈ నిబంధనలు అతిక్రమించినవారికి భారీ జరిమానా తప్పదు. టూరిస్ట్ వీసాతో సౌదీలో అడుగుపెట్టే విదేశీయులకు అక్కడి పద్దతులపై అవగాహన ఉండాలని తెలిపింది.
ప్రస్తుతం 49 దేశాలకు టూరిస్ట్ వీసాలకు అనుమతినిచ్చినట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా పలు యూరోపియన్ దేశాలు ఉన్నాయి. అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లో వస్త్రధారణ, బహిరంగ ప్రదేశాల్లో మద్దులు సర్వ సాధారణం.అయితే అలాంటివి సౌదీలో కుదరవు అని చెప్పడానికే అక్కడి ప్రభుత్వం ఈ ఆంక్షలను అమలు చేస్తోంది. కేవలం ఇవి మాత్రమే గాక.. మరో 19 అంశాల్లో సౌదీ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. కాగా,ఇప్పటివరకు కేవలం ముడి చమురు పైనే ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న సౌదీ.. పర్యాటక రంగం ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే పర్యాటక వీసాలకు తొలిసారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం ప్రస్తుతం ఏ మాత్రం బాగాలేదు.