Begin typing your search above and press return to search.

రాత్రి 7 దాటితే అమ్మాయిలకు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   8 Dec 2016 10:09 AM GMT
రాత్రి 7 దాటితే అమ్మాయిలకు నో ఎంట్రీ
X
ఇంతకాలం అమ్మాయిల దుస్తుల మీదా.. వారి ఫ్యాషన్ మీద పరిమితులు విధించటం.. ఆంక్షలు అమలు చేయటం చూశాం. కానీ.. అమ్మాయిలు ఏ టైంలో ఇంట్లో ఉండాలో.. ఏ టైంలో బయటకు రావాలన్న దరిద్రపు పోకడల్ని చూడలేదు. తాలిబన్ రాజ్యాల్లో ఉండే ఈ దుర్మార్గ కల్చర్.. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి పట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిద్ర పోని నగరంగా ట్యాగ్ లైన్ ఉన్న మెట్రో సిటీలో కాలేజీ అమ్మాయిల విషయంలో కొన్ని సంస్ధలు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకాలం కాలేజీలకు వచ్చే అమ్మాయిలు.. ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఏవస్త్రాల్ని ధరించకూడదన్న అంశంపై రూల్స్ పెట్టటం..పలువిద్యా సంస్థల్లో క్రమ శిక్షణ పేరుతో తీసుకుంటున్ననిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ముంబయికి చెందిన సెయింట్ జేవియర్ కాలేజీకి వెళ్లిన అమ్మాయిల్ని గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టకూడదన్న ఆంక్షలు పెట్టినట్లుగా చెప్పటంతో ఆ అమ్మాయిలకు షాక్ తగిలినట్లైంది.

తాలిబన్ తరహాలో విధించిన పరిమితుల పట్ల పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో అమ్మాయిలు కాలేజీ క్యాంపస్ కు రావాల్సిన అవసరం ఏమిటని? కొందరు ప్రశ్నిస్తుంటే..క్యాంపస్ లైబ్రరీ కోసం కానీ ల్యాబ్ లలో పని ఉంటే రావాల్సి ఉంటుందని.. కానీ.. తాజా పరిమితులతో వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. మరి.. ఈ తరహా నిబంధనలు తీసుకుంటున్నకాలేజీలపై ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.