Begin typing your search above and press return to search.

ప్రపంచంలోని ఏ దేశమైనా సరే.. ‘వారికి’ మాత్రం అమెరికాలో నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   5 Oct 2020 10:15 AM IST
ప్రపంచంలోని ఏ దేశమైనా సరే.. ‘వారికి’ మాత్రం అమెరికాలో నో ఎంట్రీ
X
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యంగా చెప్పే అమెరికాకు వెళ్లాలని అనుకోని వారు ఉండరు. అవకాశం కోసం కానీ.. మరే ఇతర అవసరం కోసమైనా సరే.. అమెరికాలో పని చేసే అవకాశం లభిస్తుందంటే చాటు.. తమకున్న శక్తి మొత్తాన్ని ధారపోసి అవకాశాల గడ్డకు చేరుకోవాలని భావించటం మామూలే. ప్రపంచంలోని ఎవరినైనా సరే.. తాము అనుకున్న లక్షణాలు ఉంటే చాలు.. రెండు చేతులు జాపి ఆహ్వానించే అమెరికా.. తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రపంచంలోని ఏ దేశమైనా సరే.. కమ్యునిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు.. నిరంకుశ అధికారాన్ని చెలాయించే తరహా ఉన్న పార్టీలకు చెందిన ఎవరికి కూడా అమెరికాలో కాలు పెట్టే అవకాశాల్ని మూసివేస్తూ తాజాగా నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ దేశంలోకి అడుగు పెట్టటానికి కమ్యునిస్టులు.. ఆ తరహా భావజాలం ఉన్న వారంతా అడుగు పెట్టేందుకు ఏ మాత్రం వీల్లేని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ తరహా పరిమితులు 1952లో చేసిన చట్టంలోనే ఉన్నాయి.

తాజాగా ఆ చట్టానికి మరింత మార్పులు చేయటంతో పాటు.. నిబంధనల్ని మరింత కఠినతరం చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా అమెరికా పౌరసత్వ.. ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం తాజాగా విధాన మార్గదర్శకాల పత్రాన్ని జారీ చేసింది. గతంలోని చట్టానికి మార్పులు చేసి మరింత కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనతో తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేశారు. తాజా నిర్ణయం వెనుక చైనాను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించినా.. దీని ప్రభావం రానున్న రోజుల్లో భారత్ తో సహా ప్రపంచంలోని పలు దేశాల కమ్యునిస్టు సభ్యులపై పడుతుందని చెబుతున్నారు. ఎప్పటిలానే.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రం కమ్యునిస్టులను సైతం అమెరికాలోకి అనుమతించే మినహాయింపును ఇప్పుడు కూడా కొనసాగిస్తుండటం గమనార్హం.