Begin typing your search above and press return to search.

కరోనా దరి చేరకూడదంటే.. ఈ ఐదు పనులు తప్పకుండా చేయాల్సిందే..!

By:  Tupaki Desk   |   24 April 2022 5:02 PM IST
కరోనా దరి చేరకూడదంటే.. ఈ ఐదు పనులు తప్పకుండా చేయాల్సిందే..!
X
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా మహమ్మారి కొత్త కొత్తే వేరియంట్స్ తో తన రూపు మార్చుకుంటూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే తాజాగా వచ్చినా కరోనా వైరస్ కొత్త వేరియంట్ తో మరింత ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దిల్లీ ఎన్ సీఆర్ లో కేసులు వేగంగా పెరుగుతుండటంతో... ఇది కరోనా నాలుగో వేవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

అయితే డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని... లేకపోతే ప్రజలందరూ ప్రమాదంలో పడే ఆవకాశం ఉందని వివరిస్తున్నారు. అయితే కోరనా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కేసులు పెరిగేందుకు కారణం అవుతుందని చెబుతున్నారు. అయితే కరోనా రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతున్నందున పలు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కరోనా రాదని కొంత మంది భావిస్తున్నారు. కానీ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా బారిన పడే అకాశాలు ఉన్నాయి. కానీ మీ లక్షణాలు ఇతర వ్యక్తుల కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం మాత్రమే ఉంది. అలాగే ఒకసారి కంటే ఎక్కువగా కరోనా వస్తోంది. కొందరికి కరోనా మూడు సార్లు కూడా వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కరోనా, ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటివే అయినప్పటికీ చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మంది జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. చాలా మంది ప్రజలు ఇంట్లో మందులు తీసుకోవడం వల్లే నయమవుతున్నారు. కానీ కొన్ని కేసులు తీవ్రంగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త ముఖ్యం. కరోనా కేసులు తగ్గిన వెంటనే ప్రజలు మాస్కులు ధరించడం తగ్గించారు. కరోనా ఇంకా ముగియలేదనే విషయాన్ని గుర్తుంచుకొని మెలగాలి. సామాజిక దూరం పాటించాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు. మీ అజాగ్రత్తే మిమ్మల్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.

అందుకే అత్యవసరం అయితే తప్ప ఎక్కువగా బయటకు వెళ్లకండి. వెళ్లినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించడం మంచిది. అలాగే చిన్న పిల్లలను అస్సలే బయట తిప్పొద్దు. పెద్ద వాళ్ల వ్యాక్సిన్ తీసుకున్నందున వారికి ఎక్కువ ప్రమాదం ఉండదు. కానీ చిన్న పిల్లలకు టీకాలు అందుబాటులో లేవు. అందుకే జాగ్రత్త అవసరం.