Begin typing your search above and press return to search.
26/11 దాడి తరువాత పాక్ పై దాడికి అనుమతి ఇవ్వ లేదు.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ !
By: Tupaki Desk | 28 Dec 2019 1:45 PM IST2008 ముంబయి దాడుల తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాల పై వైమానిక దాడులకు తాము సిద్ధమైనా అప్పటి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు అని ఎయిర్ ఫోర్ష్ మాజీ చీఫ్ బీస్ ధనోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై లో శుక్రవారం జరిగిన ఓ విద్యా సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాక్ భూభాగంలో ఏ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనే విషయం తమకు తెలుసు.. కానీ, దాడులు నిర్వహించాలా? వద్దా? అనేది రాజకీయ పరమైన నిర్ణయమని ఎయిర్ మార్షల్ దనోవ్ తెలిపారు.
భారత వైమానిక దళాధిపతిగా 2016 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టిన ధనోవ్.. ఆ పదవిలో 2019 సెప్టెంబరు 30 వరకు కొనసాగారు. అంతేకాదు, పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని తాము ప్రతిపాదన చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని అన్నారు. శాంతికి ప్రయత్నిస్తే తమకు మనుగడ ఉండదని పాకిస్థాన్ అభిప్రాయమని, అందుకే కశ్మీర్‌ను అడ్డుపెట్టుకుని అలజడులకు ప్రయత్నిస్తూనే ఉందని పాక్ పై ఫైర్ అయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులకు తగిన గుణపాఠం చెప్పే సత్తా వైమానిక దళం మన దగ్గర ఉంది అని , పక్కనే ఉన్న రెండు అణ్వస్త్ర దేశాల నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందని తెలిపారు.
వాయు, సముద్ర, భూ భాగంపై ప్రయోగించే అణ్వస్త్రాలు మన వద్ద ఉన్నా చైనా తన వైమానిక దళాన్ని మరింత అధునీకరిస్తోందని, పరిమాణం కంటే నాణ్యత కు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. టిబెట్ సహా పలు ప్రాంతాల్లో చైనా తన సైనిక బలగాలను విస్తరిస్తోందని, అత్యాధునిక యుద్ధ విమానాలను సరి హద్దుల్లో మోహరిస్తోందని తెలిపారు. ఫిబ్రవరి 26 బాలాకోట్‌పై మెరుపు దాడుల తో పాకిస్థాన్ షాక్ అయ్యింది అని, ఈ దాడుల గురించి పాక్ వైమానిక దళం ముందుగా గుర్తించలేక పోయింది అని తెలిపారు.