Begin typing your search above and press return to search.

తెలుగుదేశాన్ని న‌మ్మ‌లేదు..ప్ర‌త్యామ్నాయం లేనే లేదు..!

By:  Tupaki Desk   |   16 March 2021 3:05 AM GMT
తెలుగుదేశాన్ని న‌మ్మ‌లేదు..ప్ర‌త్యామ్నాయం లేనే లేదు..!
X
ఏపీలో మునిసిప‌ల్‌ - కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఎవ‌రికి వారు ఫ‌లితాల‌పై పోస్టుమార్ట‌మ్‌ లు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ వార్ వ‌న్‌ సైడ్ చేసేసింది. ఫ‌లితాలు వెలువ‌డిన 11 కార్పొరేష‌న్ల‌తో పాటు ఇటు 75 మున్సిపాల్టీల‌కు 73 చోట్ల తిరుగులేని విజ‌యం సొంతం చేసుకుంది. మైదుకూరులోనూ వైసీపీ దాదాపు గెలిచేసిన‌ట్టే.. తాడిప‌త్రిలో చివ‌రి వ‌రకు ఏం జ‌రుగుతుందో ? చెప్ప‌లేం. ఈ ఫ‌లితాల త‌ర్వాత వైసీపీకి తిరుగులేద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ప‌ల్లె ఓట‌రు మాత్ర‌మే కాదు ... ప‌ట్ట‌ణ ఓట‌రు కూడా ఆ పార్టీకే జై కొట్టేశారు. ఇక ప్ర‌త్యామ్నాయం విష‌యంలో మాత్రం తెలుగుదేశాన్ని జ‌నాలు ఏ మాత్రం న‌మ్మ‌డం లేద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

ప‌ల్లె ఓట‌రు మాత్ర‌మే కాకుండా.. ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌పై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నా నెర‌వేరలేదు. పోనీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త లేదా ? అంటే నో అనే చెప్పాలి. ఈ రోజుకు అనేక స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం లేకుండా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై చికాకు ధోర‌ణితోనే ఉన్నారు. ఇసుక స‌మ‌స్య‌కు ఇప్ప‌ట‌కీ ప‌రిష్కారం లేదు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ‌ల‌కు అంతే లేదు. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఆగిపోయింది. ఇళ్ల స్థ‌లాలు కొంద‌రికే రావడంతో ఎంతో మంది నిరుత్సాహంతో ఉన్నారు. ఇక రేష‌న్ డీల‌ర్ల‌లో కూడా వ్య‌తిరేక‌త ఉంది. ఇటు నిరుద్యోగులు కూడా డీఎస్సీ - గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు లేక అసంతృప్తితో ఉన్నారు. ఇక సంక్షేమ ప‌థ‌కాలు చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి అంద‌డం లేదు.

ఇవ‌న్నీ ఉన్నా కూడా వీటిని క్యాష్ చేసుకోవ‌డంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ విఫ‌ల‌మైంది. వైసీపీ కాక‌పోతే మేం ఉన్నా మీకు అన్న భ‌రోసా ఆ పార్టీ ప‌ట్ల ఏ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల్లోనూ క‌న‌ప‌డ‌లేదు. ఏపీ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌తో ఉన్న వారు ఎంతో మంది ఉన్నా వారు ఎక్క‌డా కూడా తెలుగుదేశాన్ని న‌మ్మ‌డం లేద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఇక తెలుగుదేశం కాక‌పోతే ప్ర‌త్యామ్నాయాన్ని వారు వెతుక్కున్నారా ? అంటే అదీ లేనే లేద‌ని ఫ‌లితాల స‌ర‌ళి చెప్పేస్తోంది.

జ‌న‌సేన + బీజేపీ కూట‌మి ఉన్నా వాళ్ల‌లో వాళ్ల‌కే న‌మ్మ‌కం లేక‌పోవడంతో ఇక ప్ర‌జ‌లు మాత్రం వారిని ఎందుకు న‌మ్ముతార‌న్న‌ది ఇక్క‌డ మెయిన్ పాయింట్‌. ఏదేమైనా అధికార పార్టీపై వ్య‌తిరేక‌త కొన్ని అంశాల్లో కూడా ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని న‌మ్మ‌లేదు.. అటు ప్ర‌త్యామ్నాయం ఉన్నా కూడా ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డ‌మే ఈ తీర్పులో విచిత్రం..!