Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు అంబానీ గారు..జర చూడండి
By: Tupaki Desk | 22 April 2020 7:00 AM ISTభారతదేశంలోనే అంత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ. ఈ నంబర్ 1 సంపన్నుడు కరోనా వేళ బాగానే స్పందించాడు. ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్ తోపాటు వేర్వేరు ప్రభుత్వ సంస్థలకు ఏకంగా రూ.535 కోట్ల విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
ఇక ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్ ఇండస్ట్రీస్ దాతృత్వ విభాగమే ‘రిలయన్స్ ఫౌండేషన్’. దీనికి చైర్మన్ ఆయన భార్య నీతా అంబానీ. ఈమె కూడా కరోనా వేళ రిలయన్స్ ఫౌండేషన్ సాయంతో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ముంబై కార్పొరేషన్ తో కలిసి రెండు వారాల్లోనే 250 పడకల కరోనా ఆస్పత్రిని నిర్మించి రోగులకు సేవలందిస్తోంది.
రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘మిషన్ అన్న సేవ’ ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఉచిత అన్నదాన పథకమని తాజాగా ఆ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో నిరుపేదలతోపాటు పలు విభాగాల సిబ్బందికి కూడా కలిపి 3 కోట్లకు పైగా భోజనాలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని మొదలుపెట్టినట్లు నీతా అంబానీ వివరించారు. రోజుకు లక్ష మాస్క్ లు - లక్ష పీపీఈ లను ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు.
ఇలా రోజువారీ కూలీలు - మురికివాడ ప్రజలు - పట్టణ పేదలు - వృద్ధులు - అనాథలకు రిలయన్స్ ‘మిషన్ అన్న సేవ’ పథకం ద్వారా ఆకలి తీరుస్తున్నట్లు నీతా అంబానీ తెలిపారు.
అయితే నీతా అంబానీ ప్రకటనపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర సహా దగ్గరైన రాష్ట్రాల్లోనే రిలయన్స్ సామాజిక సేవ చేస్తుందా తమ తెలుగు రాష్ట్రాల్లో చేయరా అని అడుగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఉచిత అన్నదాన పథకం తమ ఆకలి నింపదా అని తెలుగు రాష్ట్రాల అన్నార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రిలయన్స్ ఏపీ - తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అన్నదాన పథకం అమలు చేయాలని కోరుతున్నారు.