Begin typing your search above and press return to search.

ఆపదమొక్కులవాడికీ నివర్​ ఎఫెక్ట్..తిరుమల జలమయం

By:  Tupaki Desk   |   26 Nov 2020 2:40 PM IST
ఆపదమొక్కులవాడికీ నివర్​ ఎఫెక్ట్..తిరుమల జలమయం
X
తమిళనాడులోని పుదుచ్చేరిలో ఏర్పడ్డ నివర్​ తుఫాన్​ తెలుగురాష్ట్రాలపైన ప్రభావం చూపింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాను వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, అలుగులు పారుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​లలోనూ అక్కడక్కడ వానలు పడ్డాయి. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమైఉంది. ఇప్పటికే వరదలతో పత్తి పంట నష్టోయిన రైతులకు నివర్​ తుపాన్​తో పండిన ఆ కొద్దిపాటి పంట కూడా నాశనమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే నివర్​ ధాటికి తిరుమల శ్రీవారి ఆలయంలోకి నీళ్లు చేరాయి. ఆలయప్రాంగణంలోకి నీళ్లు చేరుకోవడంతో ఆలయాన్ని మూసేశారు.

మరోవైపు మాడవీధులు వర్షపునీటితో నిండిపోయాయి. ఆలయం ముందు కూడా భారీ వర్షపునీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నాయి. తిరుపతిలోని ఓ ఘాట్​రోడ్డులో ఓ వాహనంపై బండరాయి పడింది. కారు ముందుభాగంపై బండరాయిపడటంతో ప్రయాణికులకు ఏమీ కాలేద. కారు రెండు టైర్లు ధ్వంసమయ్యాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలతో తెలుగురాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.

తాజాగా వరదలు కురుస్తుండటంతో భారీగా పంటను నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని పలుప్రాంతాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తమ ఇండ్లముందు ఆరబోసుకున్నారు. వర్షంతో అవి తడిసిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పంటను అమ్ముకుందామంటే ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు కూడా మూసివేశారు.