Begin typing your search above and press return to search.
మోడీ చెప్పాక కూడా నితీశ్ నోటి నుంచి ఆ మాటలా?
By: Tupaki Desk | 13 Nov 2020 2:20 PM ISTఅధికారం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే నేతలు ఉన్న కాలం. అలాంటి వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమ్ థింగ్ ఈజ్ దేర్ అన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. గత బిహార్ ప్రభుత్వంలో మెజార్టీ స్థానాలున్న జేడీయూ..తక్కువ స్థానాలున్న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. మొదట ఆర్జేడీతో దోస్తానా చేసి.. టైం చూసి మోడీతో కలిసిపోయిన వైనం తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంటే.. జేడీయూ మాత్రం తక్కువ సీట్లు గెలుపొందింది. 214 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ లో ఇటీవల వెలువడిన ఎన్నిక ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 125 సీట్లు వచ్చాయి.
మేజిక్ ఫిగర్ కంటే కాసిన్ని సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కూటమిలో బీజేపీకి 74 సీట్లు వస్తే.. జేడీయూకు 43 సీట్లు రాగా హెచ్ఏఎంకు నాలుగు.. వీఐపీకి నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన మహా కూటమి 110 స్థానాల వద్ద ఆగిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భారీ ఎత్తున విజయోత్సవాల్ని నిర్వహించారు బీజేపీ నేతలు. ప్రధాని మోడీ సైతం.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ అని ప్రకటించారు. దీంతో ఆయన ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఓవైపు ఈ హడావుడి ఇలా సాగుతుంటే.. నితీశ్ మత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని కోరలేదన్నారు. తాను ప్రమాణం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి ఏర్పాట్లు చేయటం లేదన్నారు.ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికి పట్టం కట్టారని.. వారి ఆదేశాల్ని తాను శిరసావహిస్తానని చెబుతున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని.. అయితే తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదన్నారు. ఎన్డీయే సమావేశంలో చర్చించిన తర్వాతే సీఎం ఎవరన్న విషయంపై ఒక అభిప్రాయానికి రావొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇదంతా చూస్తుంటే.. సీఎం పదవికి తీసుకునేందుకు నితీశ్ సిద్ధంగా లేరన్న విషయం స్పష్టం కాక మానదు. ఎందుకిలా? అన్నదిఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధినాయకత్వం ఆదేశాల్ని పాటిస్తూ.. రిమోట్ సీఎంగా ఉండటం నితీశ్ కు ఇష్టం లేదని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. తాను ముఖ్యమంత్రిగా ఉండాలంటే.. నిర్ణయాలు తీసుకోవటానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే తప్పించి.. తాను పగ్గాలు తీసుకునేందుకు సిద్ధంగా లేనన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయం రసకందాయంలో పడినట్లుగా చెప్పక తప్పదు. నితీశ్ వ్యాఖ్యల నేపథ్యంలో మోడీషాల రియాక్షన్ ఏమిటి? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.