Begin typing your search above and press return to search.

మోడీని ఇరాకటంలో నెట్టనున్న నితీశ్

By:  Tupaki Desk   |   12 Nov 2015 4:59 AM GMT
మోడీని ఇరాకటంలో నెట్టనున్న నితీశ్
X
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఏ రేంజ్ లో మాటలదాడి జరిగిందో తెలిసిందే. ఒకరిపై ఒకరు తిట్టుకోవటం.. చిల్లరగా మాట్లాడుకున్నారు. కొంతలో కొంత బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నితీశ్ తప్పించి.. మిగిలిన వారంతా హద్దులు దాటిన వారే. అలాంటి వారి జాబితాలో ప్రధాని మోడీ కూడా ఉన్నారు. తన హోదాను మరిచి మరీ.. ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం చూసినప్పుడు బీహార్ ఎన్నికల్ని మోడీ ఎంత వ్యక్తిగతంగా తీసుకున్నారో తెలుస్తుంది.

బీహార్ ఎన్నికల్ని ప్రధాని మోడీ ఎంత సీరియస్ గా తీసుకున్నానో.. అంతే సీరియస్ గా బీహారీ ప్రజలు మోడీకి తమ ఓట్లతో తీర్పునిచ్చారు. ఇక.. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. తిరుగులేని నేతగా వ్యవహరిస్తున్న మోడీపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేసే పరిస్థితి. బీహార్ ఘోర పరాజయానికి మోడీ బాధ్యత వహించాలన్న డిమాండ్ ను పలువురు వ్యక్తం చేశారు.

ఇలా.. బీహార్ ఎన్నికల పుణ్యమా అని మోడీ ఇమేజ్ భారీగా మసకబారిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా బీహార్ నుంచి మరో ఇబ్బందికర పరిణామం మోడీకి ఎదురుకానుంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నితీశ్ కు ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమకాలీన రాజకీయాలకు భిన్నమైన వ్యక్తిత్వం నితీశ్ సొంతం. ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ.. ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. నవంబరు 20న ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణం చేయనున్న ఆయన.. తన ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్.. బీజేపీ అగ్రనేత అద్వానీ.. కాంగ్రెస్ అధనేత్రి సోనియాగాంధీ తదితరుల్ని ఆహ్వానించాలని డిసైడ్ చేశారు. మిగిలిన వారంతా ఓకే.. మరి.. మోడీ సంగతేంది? బీహార్ ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించిన వెంటనే.. ఫోన్ చేసినట్లుగా.. ప్రమాణస్వీకారోత్సవానికి మోడీ వెళతారంటారా? మొత్తానికి తన వైఖరితో మోడీని నితీశ్ ఇరాకటంలో పెట్టినట్లేనని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మొండిగా వ్యవహరించే మోడీని.. తన ప్రమాణస్వీకారోత్సవానికి రప్పించగలిగితే.. ప్రధానిపై నితీశ్ మరోసారి విజయం సాధించినట్లే.