Begin typing your search above and press return to search.

వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన నిత్యానంద ..ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   25 Aug 2020 11:16 AM GMT
వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన నిత్యానంద ..ఏమిటంటే ?
X
అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానందస్వామి గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రతిరోజూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసాడు. తాజాగా వినాయకచవితి సందర్భంగా కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలను ప్రకటించాడు. కైలాస దేశానికి కొత్త రిజర్వ బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త నాణాలు సృష్టించిన నిత్యానంద ఆదేశంలో వ్యాపారులు చెయ్యడానికి ఇతర దేశాల్లోని వ్యాపారులను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు.

అయితే , మేము కేవలం 56 హిందూ దేశాల వారితో మాత్రమే వ్యాపారాలు చెయ్యాలని నిర్ణయిం తీసుకున్నామని, ప్రపంచంలోని మిగిలిన దేశాలతో వ్యాపారాలు చెయ్యడానికి తాము అంగీకరించమని నిత్యానందస్వామి స్సష్టం చేశారు. తమిళనాడులోని టెంపుల్ సిటీ మదురైకి చెందిన కుమార్ అనే ప్రముఖ హోటల్ వ్యాపారి ఇటీవల నిత్యానందకు ఓ లేఖ రాశారు. తాను కైలాస దేశంలో హోటల్ వ్యాపారం ప్రారంభించాలని, అందుకు మీరు అనుమతి ఇవ్వాలని మదురై కుమార్ నిత్యానందకు మనవి చేశారు. తాను కైలాస దేశంలో పరోటా మాస్క్ లు, కరోనా దోసెలు విక్రయించాలని మదురైలోని ప్రముఖ హోటల్ వ్యాపారి కుమార్ మనవి చెయ్యడంతో ఆయనకు నిత్యానందస్వామి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లేఖ రాశారు. అలాగే, తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రముఖ టెక్స్ టైల్స్ వ్యాపారి న్యూ శారదా వస్త్ర దుకాణం యజమాని సైతం కైలాస దేశంలో వ్యాపారం చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని నిత్యానందకి లేఖ రాశారు. తిరుచ్చి న్యూ శారదా వస్త్ర దుకాణం వ్యాపారులకు కైలాస దేశంలో కాంచీపురం పట్టుచీరలు వ్యాపారం చెయ్యడానికి నిత్యానందస్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తమిళనాడులోని కాంచీపురం, మదురై, తిరువణ్ణామలై జిల్లాల ప్రజలు కైలాసదేశం లో పర్యటించడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్దంగా ఉన్నామని, ఈ మూడు జిల్లాల ప్రజల కోసం డిస్కౌంట్స్ ఇస్తామని నిత్యానందస్వామి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ జిల్లాల ప్రజలకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని నిత్యానందస్వామి స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి చాలా మంది సీక్రెట్ ఏజెంట్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.