Begin typing your search above and press return to search.
భక్తులకు నిత్యానంద బంపర్ ఆఫర్ !
By: Tupaki Desk | 17 Dec 2020 12:51 PM ISTస్వామీజీ నిత్యానంద .. ఈయన కూడా ఆర్జీవీ లాగా నిత్యం ఎదో ఒక వివాదం తో సావాసం చేస్తుంటారు. ప్రతిరోజు ఎదో ఒక వివాదంలో వేలు పెట్టకపోతే వీరికి నిద్రకూడా పట్టదు. ఇక తాజాగా ఈ నిత్యానంద స్వామీజీ మరో సంచలన ప్రకటన చేసారు. భక్తులకి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఏకంగా శివుణ్నే చూపిస్తా... రమ్మని భక్తులకి చెప్తున్నాడు. . తనకి తానుగా సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ క్రేజీ సంపాదించుకోవడానికి హైలెట్ అవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి.
రెండు రాత్రులు మూడు పగలు తన దేశంలో ఉండే అవకాశం ఇస్తానని, ఈ అవకాశం పొందుకోవాలి అంటే ముందు వీసా కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భక్తులు తమ సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా దేశానికి వస్తే అక్కడి నుండి కైలాస దేశానికి చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తానని సూచించారు. ఈ-మెయిల్ ద్వారా కైలాస దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవాలని సూచిస్తున్నాడు... నిత్యానంద. తన దగ్గరికి వస్తే డైరెక్ట్‌గా పరమశివుణ్నే చూపిస్తానంటూ ప్రచారం ప్రారంభించాడు.
మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో తన భక్తులకు ఈ ఆఫర్ నిత్యానంద ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారింది. కేవలం భక్తుల దగ్గర డబ్బు సంపాదించడం కోసం నిత్యానంద వేస్తున్నా సరికొత్త డ్రామా అని సోషల్ మీడియాలో ఈ వార్తపై నార్మల్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు శివుణ్ని చుపిస్తానన్న నిత్యానంద తీరా కైలాస దేశానికి వెళ్తే ఏం చూపిస్తారో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గడంతో డబ్బు కోసమే ఈ ప్లాన్ వేసాడు నిత్యానంద అంటూ చర్చించుకుంటున్నారు.