Begin typing your search above and press return to search.

నీతి ఆయోగ్ ర్యాకింగ్స్..టాప్‌-5 జాబితాలో ఆంధ్రప్రదేశ్ !

By:  Tupaki Desk   |   3 Jun 2021 9:00 PM IST
నీతి ఆయోగ్ ర్యాకింగ్స్..టాప్‌-5 జాబితాలో ఆంధ్రప్రదేశ్ !
X
ఐరాస-సమ్మిళిత అభివృద్ధి ఇండియా ఇండెక్స్ టాప్‌-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్‌ ర్యాంకుల జాభితాను విడుదల చేసింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్‌. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది.

2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఏపీ. 75 స్కోర్ తో తొలి స్థానంలో కేరళ నిలవగా, క్లీన్‌ ఎనర్జీ విభాగంలో ఏపీకి టాప్‌ ర్యాంక్ లభించింది. ఓవరాల్‌గా ఫ్రంట్‌ రన్నర్‌ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది. 2018 తో పోలిస్తే గణనీయంగా ఆంధ్రప్రదేశ్ పనితీరు మెరుగుపడింది.

దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడించారు. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అనేకమంది చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు. వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు.