Begin typing your search above and press return to search.

వ‌రంగ‌ల్ నిట్ సంచ‌ల‌న నిర్ణ‌యం: ‌మెరుగైన బోధ‌న‌కు కీల‌క అడుగు

By:  Tupaki Desk   |   4 Jun 2020 5:00 PM GMT
వ‌రంగ‌ల్ నిట్ సంచ‌ల‌న నిర్ణ‌యం: ‌మెరుగైన బోధ‌న‌కు కీల‌క అడుగు
X
త‌మ క‌ళాశాల‌‌లోని విద్యార్థుల‌ను మ‌రింత నాణ్య‌మైన చ‌దువు, ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నం చేసేలా వరంగల్ నిట్ కీల‌క అడుగు వేసింది. త‌మ విద్యార్థులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించేలా ఓ ఒప్పందం చేసుకుంది. ఈ నిర్ణ‌యంతో విద్యార్థుల‌తో పాటు క‌ళాశాల‌కు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. తాజా వ‌రంగ‌ల్ నిట్ ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్థ‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను గురువారం నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు మీడియాకు తెలిపారు.

ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో తాము ఆన్‌ లైన్‌ సమావేశమ‌య్యామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆన్‌ లైన్‌ లో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఈ విష‌య‌మై గ‌తంలోనే లాక్‌డౌన్‌కు ముందు త‌మ మ‌ధ్య చర్చలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్య, పరిశోధనాంశాల్లో సహాయ సహకారాలకు ఎంతో తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. అందుకే ఈ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్య, పరిశోధనలపై సంయుక్త పరిశోధన - పీహెచ్‌ డీ పరిశోధనలకు సహకారం - నిట్‌ లో చదివి 8 సీజీపీఏ సాధించిన విద్యార్థికి నేరుగా ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం వంటివి కీల‌క అంశాలు ఉన్నాయ‌ని వివరించారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని డైరెక్ట‌ర్ ర‌మ‌ణారావు తెలిపారు.