Begin typing your search above and press return to search.
మోడీ కేబినెట్లో.. అత్యంత జూనియర్ అతనే!
By: Tupaki Desk | 8 July 2021 10:03 PM ISTకేంద్ర మంత్రి పదవి అంటే.. అదో గురుతరమైన బాధ్యత అని, దాన్ని రాజకీయ ఉద్ధండులు, కురువృద్ధులు మాత్రమే చేపట్టాలన్నట్టుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కానీ.. రానురానూ ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా.. టాలెంట్ తో కేంద్ర మంత్రులుగా ఎదుగుతున్నారు కొందరు. ప్రస్తుత కేంద్ర మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. కేవలం 35 ఏళ్ల నేత సెంట్రల్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు.
ఆయన పేరు నిషిత్ ప్రామాణిక్. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ యువనేత.. మంత్రి పదవి చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ప్రధాని మోడీ.. నిషిత్ ప్రామాణిక్ ను హోం, యువజన, క్రీడల సహాయ మంత్రిగా నియమించారు.
బెంగాల్ లోని దిన్ హతాకు చెందిన నిషిత్.. 1986లో జన్మించారు. మొదట్లో టీచర్ గా పనిచేసిన ఆయన.. తర్వాత కాంగ్రెస్ లో యువజన విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు. కూచ్ బెహార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. దీంతో.. బెంగాల్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఏకంగా నిషిత్ ను కేంద్ర మంత్రిని చేసింది.