Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్‌లో 35 ఏళ్లకే మంత్రిగా నిశిత్ .. రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే ?

By:  Tupaki Desk   |   8 July 2021 7:30 AM GMT
మోడీ కేబినెట్‌లో 35 ఏళ్లకే మంత్రిగా నిశిత్ .. రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే ?
X
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో బెంగాల్‌ కు చెందిన నలుగురు ఎంపీలు, శాంతను ఠాకూర్, డాక్టర్ సుభాస్ సర్కార్, జాన్ బార్లా, నిషిత్ ప్రమానిక్‌ లకు కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్‌ లో పీఎం నరేంద్ర మోదీ సమక్షంలో నిషిత్ ప్రమానిక్ ఆంగ్ల భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని కొత్త ముఖాలు కూడా మంత్రివర్గంలో చేరాయి. వారిలో నిషిత్ ప్రమానిక్ ఒకరు. ఆయన వయస్సు కేవలం 35 సంవత్సరాలు. మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు. కేంద్ర హోం, యువజన, క్రీడాశాఖ సహాయమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిషిత్ ప్రామాణిక్ రికార్డులకెక్కారు. 35 ఏళ్ల నిషిత్.. మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మంత్రిగా గుర్తింపు సాధించారు. 17 జనవరి 1986లో పశ్చిమ బెంగాల్‌లోని దిన్‌హతాలో జన్మించిన నిషిత్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్ డిగ్రీ అందుకున్నారు.

2019 లో బెంగాల్‌ కు చెందిన కూచ్ బెహర్ సీటు నుంచి నిశిత్ ప్రమానిక్ ఎంపీగా విజయం సాధించారు. మొదటిసారి బీజేపీ ఎంపీ అయ్యారు. దీనికి ముందు ఆయన టీఎంసీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీని వదిలి బీజేపీలో జాయిన్ అయ్యారు. నిషిత్ ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. BCA డిగ్రీ చేశాడు. ఎంపీగా ఉన్న సమయంలో బీజేపీ ఆయనను బెంగాల్ దిన్హాట సీటు నుంచి పోటీ చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు కానీ పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నిశిత్ ప్రమానిక్ రాజవంశీ సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఆయన కూడా రాజవంశీ సంఘం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఉత్తర బెంగాల్‌ లో బీజేపీ విస్తరణ వెనుక నిషిత్ ప్రమానిక్ హస్తం ఉంటుంది. కేవలం 35 ఏళ్ల నిసిత్ ప్రమానిక్ తృణమూల్ కాంగ్రెస్ యువ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2018 లో బెంగాల్‌ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా సుమారు 300 మంది స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టారు. వీరిలో చాలామంది గెలిచారు.

దీని తరువాత ఆయన ఫిబ్రవరి 2019 లో బీజేపీలో చేరారు. అదే సంవత్సరంలో పార్టీ కూచ్ బెహర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో టీఎంసీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ తన బలాన్ని నిరూపించుకున్నారు. టీఎంసీ అభ్యర్థి చంద్రా అధికారిపై దాదాపు 54 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిషిత్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతంలో బాబుల్ సుప్రియో, దేవశ్రీ చౌదరి బెంగాల్‌ కు చెందిన రాష్ట్ర మంత్రులుగా ఉండేవారు. బాబుల్ సుప్రియో అసన్సోల్ ఎంపీ. కేంద్ర మంత్రుల మండలిలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల సహాయ మంత్రిగా ఉన్నారు. దేబాశ్రీ చౌదరి రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఇద్దరూ మంత్రివర్గం విస్తరణకు ముందే రాజీనామా చేశారు. 35 ఏళ్ల నిశిత్‌ ప్రమానిక్‌ రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ సమక్షంలో నిషిత్ ప్రమానిక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కొత్తగా మంత్రివర్గంలో చేరినప్పటికీ నిషిత్ ప్రమానిక్ మాత్రం అతిపిన్నవయస్కుడుగా నిలిచారు.