Begin typing your search above and press return to search.

కేంద్రం చేసిన అప్పులు 156 ల‌క్ష‌ల కోట్లు.. ఇక‌, రాష్ట్రాల‌కు నీతులు ఏం చెబుతారు?

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
కేంద్రం చేసిన అప్పులు 156 ల‌క్ష‌ల కోట్లు.. ఇక‌, రాష్ట్రాల‌కు నీతులు ఏం చెబుతారు?
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు త‌ర‌చుగా.. ఇత‌ర రాష్ట్రాల‌కు నీతులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అప్పులు చేయొద్దు.. శ్రీలంక‌లాగా మారొద్దు.. అని కొన్నాళ్లుగా కేంద్ర పెద్ద‌లు రాష్ట్రాల‌కు ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. త‌మ‌కు క‌లిసి వ‌స్తున్న ఏపీ వంటి ప్ర‌భుత్వాల‌కు చేతినిండా అప్పులు చేసుకునే అవ‌కాశం ఇస్తూనే.. మ‌రోవైపు తెలంగాణ వంటి పొడ‌గిట్ట‌ని రాష్ట్రాల‌కు మొండి చేయి చూపిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు అస‌లు కేంద్రం ఈ 8 ఏళ్ల‌లో ఎంత అప్పు చేసింద‌నే విష‌యం అధికారికంగా.. పార్ల‌మెంటుకు చెప్పింది.

ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ నెల 31 నాటికి కేంద్రం చేసిన అప్పులు రూ.156 ల‌క్ష‌ల కోట్ల కు చేరింద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. దీనిని రాష్ట్ర జ‌నాభాతో గుణిస్తే.. ఒక్కొక్కరిపై ల‌క్ష కోట్ల అప్పు ఉంద‌ని ఆమే స్వ‌యంగా వివ‌రించారు. అంతేకాదు.. ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల మేర‌కు కూడా ఇది లేద‌ని విప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌కు ``ఔను.. లేదు.`` అని ఆమె నిర్మొహ‌మాటంగా చెప్పేశారు. జీడీపీలో 40 శాతానికి మించి ఏ ప్ర‌భుత్వం కూడా అప్పులు చేయ‌డానికి వీల్లేద‌ని ఎఫ్ ఆర్ బీఎం చ‌ట్టం చెబుతోంది.

అయితే.. కేంద్రం చేసిన అప్పులు మాత్రం దేశ జీడీపీలో 57.3 శాతం ఉంది. ఇది నిబంధ‌న‌ల‌కు పూర్తి విరుద్ధం అయిన‌ప్ప‌టికీ.. ఆమెస‌మ‌ర్థించుకున్నారు. ఇదిలావుంటే.. ఒకప్పటితో పోలిస్తే ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోట్లు మునుపటిలా కనిపించడం లేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆ నోట్లను తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోటు లభ్యతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టతనిచ్చారు. ఏటీఎంలలో నోట్లను ఉంచాలని గానీ, ఉంచొద్దని గానీ తాము బ్యాంకులకు సూచించలేదని చెప్పారు.

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు కాగా.. 2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రాల్లో నోట్లను అందుబాటులో ఉంచడమనేది బ్యాంకుల స్వతంత్ర నిర్ణయమని తెలిపారు. కాలానికి అనుగుణంగా, ఖాతాదారుల అవసరాలను బట్టి నోట్లను జమ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఇక‌, కేంద్రం అప్పుల విష‌యాన్ని తీసుకుంటే.. రాష్ట్రాల‌కు అప్పులు చేయొద్ద‌ని నీతులు చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని విప‌క్ష నాయ‌కులు ముఖ్యంగా బీఆర్ ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.