Begin typing your search above and press return to search.

న్యాయానికి అడుగుదూరంలో ఉన్నాం ..నిర్భయ తల్లి

By:  Tupaki Desk   |   18 Dec 2019 11:03 AM GMT
న్యాయానికి అడుగుదూరంలో ఉన్నాం ..నిర్భయ తల్లి
X
ఢిల్లీ కోర్టు నిర్భయ నిందితుల డెత్ వారెంట్ వాయిదా వేయడంతో నిర్భయ తల్లి కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదెంతో సంతోషకరమని - న్యాయం జరగడానికి మనం ఒక అడుగు ముందుకు వేసినట్టేనని ‘ ఆమె అన్నారు. క్షమాభిక్ష దరఖాస్తు కోసం న్యాయమూర్తి నిందితులకు గడువు ఇవ్వడంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్లినా దోషుల హక్కుల గురించే మాట్లాడుతున్నారని.. మరి తమ హక్కుల మాటేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ తల్లి ఆవేదనపై స్పందించిన న్యాయమూర్తి.. మీ ఆవేదనను అర్థం చేసుకోగలనని - మీపై సానుభూతి ఉందని చెప్పారు. అయితే దోషులకు కూడా హక్కులు ఉంటాయని.. చట్టాన్ని తాము అనుసరించాల్సిందేనని చెప్పారు.

కోర్టు తీర్పు చెప్పిన తరువాత బయటకు వచ్చి .. మీడియాతో మాట్లాడిన నిర్భయ తలిదండ్రులు… దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ మీద కోర్టు వెలిబుచ్చిన నిర్ణయం - తమలో ఇంకా భయాన్ని పూర్తిగా తొలగించలేదని వ్యాఖ్యానించారు. ఇది భయంతోనూ - హృదయభారంతోను కూడిన మా ప్రయాణంలో ఒక భాగమే అని వారు చెప్పారు. తమ కూతురిపై దారుణంగా అత్యాచారం చేసిన రేపిస్టులను ఉరి తీసేవరకు ఈ మా ప్రయాణం పరి సమాప్తం కాదు అని వారు చెప్పారు.

నలుగురు దోషులను ఉరి తీసినప్పుడే ఈ జర్నీ ముగుస్తుంది అని భావోద్వేగంతో చెప్పారు. తాము ఏడేళ్లుగా ఈ యుధ్ధం చేస్తున్నామని ఆశాదేవి గుర్తు చేశారు. ఇది దాదాపు ముగింపు దశకు వచ్చిందని - మేము కాకా ఈ ఇండియాలోని మహిళలు - పిల్లలు కూడా ఇలాంటి తీర్పు కోసం వేచి ఉన్నారని - వాళ్లంతా తమకు కూడా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారని ఆమె అన్నారు.