Begin typing your search above and press return to search.

నిందుతుల కే మానవ హక్కులు ఉంటాయా ... నిర్భయ తల్లి ఆగ్రహం !

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:16 AM GMT
నిందుతుల కే మానవ హక్కులు ఉంటాయా ... నిర్భయ తల్లి ఆగ్రహం !
X
హైదరాబాద్ లో జరిగిన దిశ ఉందంతం గురించి మొత్తం దేశ వ్యాప్తం గా నిరసనలు వెలువడిన విషయం తెలిసిందే. వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ని నలుగురు కామాంధులు అతి కిరాతకంగా అఘాయిత్యం చేసి , హత్య చేసి , పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటన పై పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసన తెలపడంతో ..పోలీసులు వేగంగా స్పందించి , నిందుతులని పట్టుకోగా ..ఆ తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లో ఆ నలుగురు కూడా మరణించారు. దీనితో పోలీసులపై ప్రజలు హర్షం వ్యక్తం చేయగా ... మానవ హక్కుల సంఘం వారు ఏ ఎన్ కౌంటర్ పై అనుమానులు ఉన్నాయని , ఈ ఎన్ కౌంటర్ పై విచారణ మొదలు పెట్టారు.

దిశ పై , అలాగే ఎందరో అమ్మాయిల పై అఘాయిత్యాలు జరిగినప్పుడు పట్టించుకోని మానవహక్కుల సంఘం ..ఇప్పుడు నలుగురు నిందుతులని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే విచారణ అంటూ వచ్చి రాద్దాంతం చేస్తుండటం తో అందరూ మానవ హక్కుల సంఘం వారి పై మండిపడుతున్నారు. తాజాగా నిర్భయ తల్లి కూడా వారి పై విరుచుకుపడింది. ‘నా కూతురు పేగుల్ని బయటకు లాగినప్పుడు.. వారికి మానవ హక్కుల సంగతి గుర్తుందా?’ ..అని నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో.. ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టు లో మంగళవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

అందులో అతడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో అంశాల గురించి ప్రస్తావించడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైన వారికి పూర్తిస్వేచ్ఛ ఉంటుంది.. మాకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? అని , బాధితులకు మాత్రమే ఎందుకు అన్ని నిబంధనలూ చూపుతారు? అంటూ ఫైర్ అయ్యింది. ఎట్టి పరిస్థుతుల్లో వాళ్లని డిసెంబరు 16నే ఉరి తీయాలి అని ఆమె డిమాండ్ చేసింది.