Begin typing your search above and press return to search.

వణికిపోతున్న నిర్భయ నిందుతులు.!

By:  Tupaki Desk   |   15 Dec 2019 11:26 AM IST
వణికిపోతున్న నిర్భయ నిందుతులు.!
X
నిర్భయ నిందితులు చావుభయంతో వణికిపోతున్నారు. వారికి మృత్యువు కళ్లముందే కదలాడుతుండడంతో తిండి, నిద్ర సహించడం లేదట.. 16వ తేదీన ఉదయం వీరి ఉరికి రంగం సిద్ధం చేశారట తీహార్ జైలు అధికారులు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

నిర్భయ నిందితులు నలుగురిలో అక్షయ్ సింగ్ తన మరణశిక్షపై రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో దీనిపై సుప్రీం కోర్టు ఈనెల 17న విచారించనుంది. నిర్భయను పాశవికంగా చంపిన వీరి పిటీషన్ తిరస్కరించడం ఖాయం. సో మరణం ఒకరోజు మాత్రమే ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట..

మరణం తథ్యం కావడంతో నిర్భయ నలుగురు నిందితులు తిండి మానేశారట.. నీళ్లు తీసుకోవడం లేదట.. నిద్ర కూడా పోవడం లేదట.. వీళ్లు ఆత్మహత్య చేసుకుంటారేమోననే భయంతో జైలు అధికారులు ఒక్కో నిందితుడు చుట్టూ 24 గంటలు ఐదారుగురు పోలీసులను కాపాలా పెట్టేశారు. ఇప్పటికే రాంసింగ్ అనే నిర్భయ నిందితుడు 2013లో ఉరివేసుకున్నాడు. ఇక మైనర్ అయిన మరో నిందితుడు 3 ఏళ్లు జైలు శిక్ష పడి బయటకు వచ్చేశాడు. దీంతో వీరు నలుగురు కూడా ఉరిశిక్ష ఖాయం అని తెలియడంతో ప్రాణ భయంతో ఆత్మహత్యకు పాల్పడకుండా జైలు అధికారులు, తీహార్ డైరెక్టర్ కూడా అనుక్షణం కాపాల కాస్తున్న పరిస్థితి తీహార్ జైల్లో ఉంది. ఇక ఉరితీయడానికి తలారీ - ఉరితాళ్లను జైలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. వీరి మరణం కోసం బాధితులు - మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.