Begin typing your search above and press return to search.

హైకోర్టు సంచలనం: నిర్భయ దోషులకు 20న ఉరి

By:  Tupaki Desk   |   5 March 2020 11:30 AM GMT
హైకోర్టు సంచలనం: నిర్భయ దోషులకు 20న ఉరి
X
ఉరిశిక్ష తప్పించుకోవడానికి నానా రకాల ప్లాన్లు వేసిన నిర్భయ దోషులకు ఎట్టకేలకు మూడింది. ఢిల్లీ పటియాలా కోర్టులో చివరకు నిర్భయ దోషులకు చుక్కెదురైంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్లను కోర్టు తోసిపుచ్చింది.

గురువారం విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నలుగురు దోషులైన పవన్ గుప్తా, ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ లను ఉరి తీయాలని తీర్పునిచ్చింది.

మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఈ నలుగురికి ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో నిర్భయ దోషులకు దారులన్నీ మూసుకుపోయాయి.

తాజాగా నిర్భయ హత్యాచారంలో నలుగురు దోషులలో ఒకడైన పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఈ కేసులో ఇప్పటికే నిర్భయ దోషులైన ముఖేష్ కుమార్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ క్షమాభిక్ష దరఖాస్తులను రాష్ట్రపతి ఇదివరకే తిరస్కరించారు. దీంతో ఉరికి సంబంధించిన అవరోధలన్నీ తొలగిపోయాయి.

దీంతో దోషుల ఉరితీతకు తాజాగా డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ ఢిల్లీ సర్కారు పటియాల హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.