Begin typing your search above and press return to search.

నిర్భయ కేసు: డిసెంబర్ 16, 2012లో అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   20 March 2020 10:03 AM IST
నిర్భయ కేసు: డిసెంబర్ 16, 2012లో అసలేం జరిగింది?
X
ఎట్టకేలకు దాదాపు 7 ఏళ్లు దాటిన తర్వాత నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడింది. నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. ఈ ఉదయం నిర్భయ రేపిస్టులను ఉరితీయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అసలు ఈ నిర్భయను ఎలా దారుణంగా అత్యాచారం చేశారు? ఎలా ఆమె మరణానికి కారణమయ్యారు? అసలు డిసెంబర్ 16, 2012న ఏ జరిగిందో తెలుసుకుందాం..

అది 2012.. డిసెంబర్ 16.. నిర్భయ, ఆమె స్నేహితుడు సినిమాకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్నారు. అప్పుడే వచ్చిన ఒక ప్రైవేట్ బస్సులో వారిద్దరూ ఎక్కారు. అందులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. బస్సులో ఉన్న నిర్భయ వద్దకు వచ్చిన ముగ్గురు ఆమెను ఈ సాయంత్రం వేళ ఎటు వెళ్లారంటూ దూషిస్తూ కామెంట్స్ చేశారు. ఆమె స్నేహితుడు గొడవపడ్డాడు. క్యాబిన్ లో మరో ఇద్దరు కూడా వచ్చి నిర్భయ, ఆమె స్నేహితుడితో గొడవపడ్డారు.

నిర్భయ వెళ్లాల్సిన రూట్ లో కాకుండా మరో రూట్ లో బస్సు వెళ్లడంతో అనుమానం వచ్చి నిర్భయ, ఆమె స్నేహితుడు ప్రశ్నించారు. దీంతో బస్సులో ఉన్న యువకులు నిర్భయ స్నేహితుడిపై రాడ్డుతో దాడి చేశారు. అతడు సృహ తప్పి పడిపోయాడు. నిర్భయను కూడా అదే రాడ్డుతో దాడి చేశారు. బస్సులోనే ఒకరి తర్వాత మరొకరు ఆరుగురు రేప్ చేశారు. సున్నితమైన ఆమె ప్రాంతాల్లో రాడ్డు కూడా దింపడంతో నిర్భయ తీవ్ర అస్వస్థతకు గురైంది.

రేప్ చేశాక నగ్నంగా లేకుండా ఉన్న నిర్భయను, ఆమె స్నేహితుడిని బస్సు నుంచి కిందకు పడేశారు. వారిని చూసిన టోల్ ప్లాజా సిబ్బంది స్థానికుల సాయంతో సప్తార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తరలించింది. నిర్భయ చికిత్స పొందుతూ డిసెంబర్ 29న చనిపోయింది.