Begin typing your search above and press return to search.

నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన 'మోదీ'

By:  Tupaki Desk   |   2 July 2021 11:39 AM GMT
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన మోదీ
X
నీరవ్ మోడీకి ఆయన సోదరి షాక్ ఇచ్చింది. కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్లు అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వ్యవహారంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ సోదరి పూర్వీ మోడీ సరెండర్ అయిపోయారు. భారత ప్రభుత్వానికి ఆమె రూ.17.25 కోట్లు చెల్లించడం సంచలనమైంది.

యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి రూ.17 కోట్లను భారత ప్రభుత్వానికి పూర్వీ మోదీ పంపినట్టు ఈడీ వెల్లడించింది. జూన్ 24న ఈ మొత్తం పూర్వీ మోదీ ఖాతా నుంచి భారత ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిసింది.

అయితే తన సోదరుడు నీరవ్ మోదీ సూచన మేరకు ఈ ఖాతా తెరిచారని.. అందులోని నగదుతో పూర్వీకి సంబంధం లేదని ఈడీ పేర్కొంది.పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో సహకరించేందుకు నీరవ్ సోదరి పూర్వీ మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతాకు జనవరిలో ఈడీ అనుమతిచ్చింది. దీంతో ఆమె అప్రూవర్ గా మారింది.

ఈ క్రమంలోనే పూర్వీ మోదీ 23 లక్షలకు పైగా డాలర్లను యూకే ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి పంపించారని ఈడీ తెలిపింది. పూర్వీ మోదీ సహకారంతోనే ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

ఇక అప్రూవర్ గా మారిన పూర్వీ మోదీ, ఆమె భర్త మయాంక్ లపై చర్యలు తీసుకోకుండా ఈడీ క్షమాభిక్ష పెట్టి వదిలేసింది.ప్రస్తుతం నీరవ్ మోడీ యూకేలో విచారణ ఖైదీగా ఉన్నారు. భారత్ కు అప్పగించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించినా అప్పీలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు.