Begin typing your search above and press return to search.

మోదీ 100 కోట్ల బంగ్లాను బాంబులతో కూల్చేశారు

By:  Tupaki Desk   |   8 March 2019 10:40 AM GMT
మోదీ 100 కోట్ల బంగ్లాను బాంబులతో కూల్చేశారు
X
దేశంలోనే అతి పెద్ద ఆర్థిక నేరంకు పాల్పడ వారిలో నీరవ్‌ మోదీ ముందు వరుసలో ఉంటాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను దాదాపుగా దివాళా తీసే వరకు తీసుకు వచ్చిన ఈయన ఆర్థిక కుంభకోణం బయట పడటంతో విదేశాలకు పారిపోయాడు. మోదీకి చెందిన పలు ఆస్తులను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వారు జప్తు చేసిన విషయం తెల్సిందే. తాజాగా మోదీకి ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద బంగ్లాను ప్రభుత్వ అధికారులు బాంబులతో కూల్చివేయడం, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహారాష్ట్ర అలీబాగ్‌ లో సముద్ర తీరంలో 33 వేల చదరపు అడుగుల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన పెద్ద బంగ్లాను మోదీ నిర్మించాడు. ఆ బంగ్లా అత్యంత ఆధునిక హంగులతో నిర్మించబడటంతో పాటు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కూడా కలిగి ఉంది. భవనం చుట్టు హై మెటల్‌ ఫెన్సింగ్‌, ఇతరులు ఎవరు ఎంటర్‌ అవ్వలేనంత సెక్యూరిటీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. లోపల స్విమ్మింగ్‌ పూల్స్‌ ఇంకా రకరకాల వసతులు ఉన్నాయి. ఇన్ని వసతులతో నిర్మించిన బంగ్లా కోస్టర్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనలకు అతిక్రమించి ఉంది.

అలీబాగ్‌ లోని మోదీ బంగ్లాతో పాటు మరో 58 బంగ్లాలు కూడా నిబంధనలకు అతిక్రమించి నిర్మించినట్లుగా వెళ్లడయ్యింది. వాటన్నింటిని కూల్చి వేయాలని నిర్ణయించారు. తాజాగా మోదీ బంగ్లాను భారీ క్రేన్స్‌ తో పాటు బాంబులను కూడా వినియోగించి నేలమట్టం చేశారు. మోదీ బంగ్లా నేలమట్టంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మోదీ ఎంతో ఇష్టపడి ఈ బంగ్లాను కట్టించుకున్నాడని, ఇక్కడ సన్నిహితులకు మరియు కుటుంబ సభ్యులకు అప్పుడప్పుడు పార్టీలు ఇచ్చేవాడని స్థానికులు చెబుతూ ఉన్నారు.