Begin typing your search above and press return to search.

ఆ తొమ్మిది మంది దగ్గరే 2.41లక్షల కోట్లు?

By:  Tupaki Desk   |   3 March 2016 6:29 AM GMT
ఆ తొమ్మిది మంది దగ్గరే 2.41లక్షల కోట్లు?
X
ఒక్కరిగా చూస్తే పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ.. ఒక బృందంగా చూస్తే మాత్రం భారీ ఆస్తిపాస్తుల కిందకే వస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ లకు చాలా దగ్గరగా తొమ్మిది మంది ఐటీ పారిశ్రామికవేత్తల ఆస్తులు ఉండటం విశేషం. ఐటీ రంగంలో ప్రముఖులుగా పేరున్న తొమ్మిది మంది ఐటీ దిగ్గజాల ఆస్తుల విలువను మొత్తం కలిపితే భారీ మొత్తంగా మారటమే కాదు.. వామ్మో.. ఇంత మొత్తమా అన్న ఆశ్చర్యం కలగక మానదు.

విప్రో అజీజ్ ప్రేమ్ జీ.. శివ నాడార్.. ఆర్ నారాయణ మూర్తి.. గోపాల్ కృష్ణన్.. నందన్ నీలకేని.. సచిన్ బన్సాల్.. బిన్ని బన్సాల్.. కె దినేశ్.. ఎస్ డీ శిబులాల్ ఆస్తుల్ని తాజాగా ఫోర్బ్ సంస్థ విడుదల చేసిన ఆస్తులతో లెక్క వేసినప్పుడు.. ఈ తొమ్మిది మంది ఐటీ దిగ్గజాల వ్యక్తిగత ఆస్తి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. వీరిలో విప్రో అధినేత అజీజ్ ప్రేమ్ జీ ఆస్తి విలువే లక్ష కోట్లకు పైనే ఉండటం గమనార్హం. తొమ్మిది మందిలో అజీజ్ ప్రేమ్ జీ ఆస్తులే ఎక్కువ. ఆయన తర్వాత స్థానాల్లో శివనాడార్.. నారాయణ్ మూర్తి తదితరులు ఉండటం గమనార్హం.