Begin typing your search above and press return to search.

గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ.. ఏం రాశాడంటే?

By:  Tupaki Desk   |   25 Jun 2020 7:20 AM GMT
గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ.. ఏం రాశాడంటే?
X
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఆయన ఏపీ గవర్నర్ హరిచందన్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. గతంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ తానే రాశానని చెప్పుకొచ్చాడు. తాజాగా రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ విమర్శలు చేశారు.

నిమ్మగడ్డ గవర్నర్ కు రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని.. కొందరు వ్యక్తులు తనను నీడలా వెంటాడుతున్నారని ఆరోపించారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాను విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారని తెలిపారు. విజయవాడలో తన తల్లికి అనారోగ్యం ఉన్నా చూడలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.

కేంద్రహోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై ఎంపీ విజయసాయిరెడ్డి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఆ లేఖ తాను రాశానని చెప్పినా వినకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ఎన్నికల సంఘం కమిషనర్ నియామక అధికారం గవర్నర్ కే ఉందని హైకోర్టు సూచించిందని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిమ్మగడ్డ తాజా లేఖలో గవర్నర్ ను కోరారు. తనను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

కాగా నిమ్మగడ్డ తాజాగా హైదరాబాద్ లో బీజేపీ నేతలు సుజనా, కామినేనితో భేటి అయ్యి అడ్డంగా బుక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇలా లేఖలు రాసి ఈ వివాదాన్ని దృష్టి మరలుస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.