Begin typing your search above and press return to search.
స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ రమేశ్ దూకుడు
By: Tupaki Desk | 17 Nov 2020 11:33 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఎక్కడా తగ్గడం లేదు. ఈ మేరకు తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. దూకుడుగా ముందుకు వెళుతున్నారు.
తాజాగా ఎన్నికల విషయమై జగన్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. గవర్నర్ తో భేటికి నిర్ణయించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మ గడ్డ రమేశ్ కుమార్ భేటి కానున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే పంచాయితీ ఎన్నికలపై గవర్నర్ తో చర్చిస్తారని సమాచారం.
అయితే ఏపీలోని జగన్ సర్కార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేదని ప్రకటించింది. సీఎం జగన్ సైతం గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం.
అయితే కరోనా కేసులు తగ్గాయని.. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిమ్మగడ్డ దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించి గవర్నర్ ద్వారా ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచిచూడాలి..