Begin typing your search above and press return to search.

కలెక్టర్లు, ఎస్పీలతో ఎల్లుండి నిమ్మగడ్డ కీలక భేటి

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:42 AM IST
కలెక్టర్లు, ఎస్పీలతో ఎల్లుండి నిమ్మగడ్డ కీలక భేటి
X
ఏపీలో ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సహకరిస్తామని నిన్న ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. తాజాగా నిమ్మగడ్డ జోరు పెంచారు. ఎన్నికలను వెంటనే రీషెడ్యూల్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే బుదవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎస్ ఆధిత్యనాథ్ దాజ్, డీజీపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

ప్రధానంగా పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ చర్చించనున్నారు. పంచాయితీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ దిశానిర్ధేశం చేయనున్నాయి.

ఇక పంచాయితీల్లో భద్రతాపరమైన అంశాలపై కూడా కీలక నిర్ణయం దిశగా నిమ్మగడ్డ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్ధేశం చేస్తారు.