Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ టీడీపీ సొంతం... మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 26 Jan 2021 3:00 PM ISTఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రభుత్వం ససేమిరా అంటున్నా కూడా సుప్రీం కోర్టు తీర్పు తో ఎన్నికలు జరపడానికి సిద్దం చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ క్షేత్రస్థాయి ఎన్నికలపై దృష్టి సారించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది.
అయితే , ఈ స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా నిర్వహించగలరా, లేదా అనే అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు ఇప్పటికే బహిరంగంగా అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉంటే.. దీనిపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ ఎన్నికల గురించి ఈసీ , ప్రభుత్వం మధ్య యుద్ధం , దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లడం పై అయన మాట్లాడారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ సొంతం చేసుకుందని, అందువల్లే ఆయన పనితీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, విశ్వసనీయతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. టీడీపీకి తోడు ఒక వర్గానికి చెందిన మీడియా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమవాడిగా చూస్తోందని చెప్పారు. ఇది అనవసరమని అన్నారు. టీడీపీ, ఒక వర్గానికి చెందిన మీడియా ఆయన విధి నిర్వహణను ఆయనకు వదిలేయడం మంచిదని చెప్పారు. అలాంటిప్పుడే నిమ్మగడ్డ మరింత విశ్వసనీయతతో పని చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి పట్ల టీడీపీ వంటి బలమైన రాజకీయ పార్టీ ముద్రపడటం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తీకరించారు.