Begin typing your search above and press return to search.

మళ్ళీ కోర్టు మెట్లక్కనున్న నిమ్మగడ్డ?

By:  Tupaki Desk   |   19 Nov 2020 1:30 PM GMT
మళ్ళీ కోర్టు మెట్లక్కనున్న నిమ్మగడ్డ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయటానికి రెడీ అయిపోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ డిసైడ్ అయ్యారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వ అంటోంది. ఎన్నికల నిర్వహణ సన్నాహకాల్లో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలతో గురువారం ఉదయం నిమ్మగడ్డ నిర్వాహించాలని అనుకున్న వీడియా కాన్ఫరెన్సు రద్దయ్యింది.

ఈ వీడియో కాన్ఫరెన్సు కాదు బుధవారం మద్యాహ్నం నిర్వహించాలని అనుకున్న వీడియో కాన్ఫరెన్సు కూడా కుదరలేదు. కరోనా వైరస్ నియంత్రణ బిజీలో జిల్లాల్లోని ఉన్నతాధికారులంతా బిజీగా ఉన్న కారణంగా వాళ్ళని వీడియో కాన్ఫరెన్సుల పేరుతో డిస్ట్రబ్ చేయవద్దని చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని కమీషనర్ కు రాసిన లేఖలో స్పష్టంగా
చెప్పారు. ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వం వద్దంటున్నా నిమ్మగడ్డ పంతానికి పోయి తాను అనుకున్న పని ఎలాగైనా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సందర్భంగా నిమ్మగడ్డ చేయాలని అనుకుంటున్నదాన్ని ప్రభుత్వం కూడా అడ్డుకుంటోంది. ప్రభుత్వం-నిమ్మగడ్డ వ్యవహారం చివరకు టామ్ అండ్ జెర్రీ షో లాగ తయారైపోయింది. ఎన్నికల నిర్వహణ, సన్నాహక సమావేశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహణలో ప్రభుత్వం సహాయ నిరాకరణ లాంటి అంశాలపై కలెక్టర్ బుధవారం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని కాదని చేసేదేమీ ఉండదు.

ఈ కారణంతోనే నిమ్మగడ్డ ప్రభుత్వంపై మళ్ళీ కోర్టులో కేసు వేయాలని డిసైడ్ అయిపోయారు. తాను ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా ప్రభుత్వం సహాయ నిరాకరణ విషయాన్ని కోర్టులో ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీహార్లో జరిగిన ఎన్నికలు, తెలంగాణాలో మొదలైన స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను ఏపిలో ఎన్నికలు జరగటానికి ఉదాహరణలుగా నిమ్మగడ్డ చూపించబోతున్నారు. మరి కోర్టు ఏమంటుందో చూద్దాం.