Begin typing your search above and press return to search.

మేము లోక‌ల్‌... నాన్న‌ను గెలిపించండి - నిహారిక‌

By:  Tupaki Desk   |   3 April 2019 8:46 AM GMT
మేము లోక‌ల్‌... నాన్న‌ను గెలిపించండి - నిహారిక‌
X
సుదీర్ఘ కాలం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే క‌నిపించినా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే స‌మ‌యానికి కొణిదెల కుటుంబం మొత్తం పార్టీలో దూకుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వ‌స్తున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌గా... అదే ప్రాంతానికి న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాగ‌బాబు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నాగ‌బాబు కూతురు నిహారిక తండ్రి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంది.

మేము లోక‌ల్. మాదీ ఇదే ఊరే. నాన్న‌ను గెలిపించండి. బాబాయి పార్టీ గెలిపించండి... రాష్ట్రానికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది అంటూ ఓట‌ర్ల‌కు నిహారిక పిలుపునిచ్చింది. బాబాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌క్క‌టి ఆశయాలతో పార్టీ పెట్టారని, జనసేన ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నిహారిక చెప్పడం విశేషం. నాన్న ఇక్క‌డ క‌చ్చితంగా గెలుస్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉంద‌ని ఆమె విశ్వాసం వెలిబుచ్చారు.

అయితే... గ‌తంలో బాబాయి కోసం ఏమైనా చేస్తాన‌ని మీడియాతో చెప్పిన రాంచ‌ర‌ణ్ ఎన్నిక‌లకు ఇక వారం రోజులే మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఇంత‌వ‌ర‌కు పార్టీలోకి రాలేదు. క‌నీసం ఇద్ద‌రు బాబాయి లో పోటీలో ఉంటే సోష‌ల్ మీడియాలో కూడా పిలుపు ఇవ్వ‌లేదు. మ‌రి ఇటీవ‌లే వినయ విధేయ రామ ఫంక్ష‌న్లో కేటీఆర్‌ని తండ్రీ కొడుకులు బాగాపొగిడారు. మ‌రి ఎందుకు సంబంధాలు చెడ‌గొట్టుకోవ‌డం అని రాలేదేమో.?