Begin typing your search above and press return to search.

ఏపీలో మళ్లీ నైట్ కర్ఫ్యూ.. ప్రభుత్వం కీలక నిర్ణయాలివీ

By:  Tupaki Desk   |   1 Feb 2022 9:30 AM GMT
ఏపీలో మళ్లీ నైట్ కర్ఫ్యూ.. ప్రభుత్వం కీలక నిర్ణయాలివీ
X
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠినతరం చేసింది. అంతేకాదు ఏపీలో నైట్ కర్ఫ్యూను విధించింది. తాజాగా నైట్ కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ అమల్లో కర్ఫ్యూ ఉండనుంది. ఏపీలో నిత్యం 10వేలకు చేరువలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. అయితే మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటి వృద్ధులు కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సూచనలు చేసింది.

కొంతకాలంగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు పెడుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లోకి వినియోగదారుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలని తెలిపింది. ఒకవేళ మాస్క్ ధరించని వినియోగదారుడిని షాపుల్లోకి అనుమతినిచ్చే ఆ షాప్ నిర్వాహకులపై గరిష్టంగా 25 వేల జరిమానా విధించనున్నారని తెలిపింది.

ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో 5879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది ఈ మహమ్మారి బారినపడి మరణించారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 14615 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులున్నాయి.