Begin typing your search above and press return to search.

లవర్ కి నిశ్చితార్థం రింగ్ పెట్టిన పంజాబ్ హిట్టర్

By:  Tupaki Desk   |   17 Nov 2020 5:00 PM IST
లవర్ కి నిశ్చితార్థం రింగ్ పెట్టిన పంజాబ్ హిట్టర్
X
ఐపీఎల్లో కొన్నేళ్లు గా అట్టడుగు స్థానాలకే పరిమితమవుతూ వచ్చిన పంజాబ్ ఈసారి రాహుల్ సారథ్యం లో ఫైనల్స్ కి వచ్చింది. పంజాబ్ కడదాకా రావడానికి పూరన్ కూడా తన వంతు సాయం చేశాడు. జుట్టుకు అవసరమైన ప్రతి సారి ధాటిగా ఆడి విజయాలు అందించాడు. తాజాగా నికోలస్ పూరన్ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను ఓ ఇంటి కాబోతున్నట్లు తెలిపాడు.

తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్‌తో నిశ్చితార్థం చేసుకున్న నికోలస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. . మొకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫొటోను అతడు అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోకు 'ఆ భగవంతుడి ఆశీస్సుల తో మిగ్యూల్‌ తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను'అని క్యాప్షన్‌ గా పేర్కొన్నాడు. నికోలస్ నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న క్రికెట్ ప్రేమికులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ జాసన్ హోల్డర్, వన్డేల కీరన్ పొలార్డ్ పూరన్‌ అభినందనలు తెలియజేశారు. పంజాబ్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఈ నిశ్చితార్థ వేడుకపై స్పందించారు .'కంగ్రాట్స్ నిక్కీ' అని శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రేమ స్వచ్చమైనది, ఇద్దరికి అభినందనలు' అంటూ హోల్డర్ ట్వీట్ చేశాడు. ముంబై విధ్వంసక బ్యాట్స్మెన్ పొలార్డ్ 'ది ప్రొఫెషనల్ కంగ్రాట్స్'అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇండియా లోని ఐపీఎల్ క్రికెట్ అభిమానుల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా పలు ట్వంటీ టోర్నమెంట్లు ఆడుతున్న పూరన్ కు ఆయా జట్ల అభిమానులు, కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లు, అభిమానులు పెళ్ళి కొడుకు కాబోతున్న పూరన్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు.