Begin typing your search above and press return to search.

త్రివర్ణ శోభితంగా నయాగరా జలపాతం .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   30 April 2021 8:30 AM GMT
త్రివర్ణ శోభితంగా నయాగరా జలపాతం .. ఎందుకంటే ?
X
న్యూయార్క్-కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా జలపాతం అందాలు వర్ణనలకు అతీతం. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న సమయంలో కెనడా ప్రభుత్వం నయాగరా జలపాతాన్ని భారత పతాకంలోని త్రివర్ణంతో అలరించి తమ మద్దతుని తెలిపింది. భారత్‌ కు తనదైన సంఘీభావాన్ని ప్రకటించింది. దాదాపుగా 30 నిమిషాలకు పైగా, నయాగర జలపాతం భారత్ త్రివర్ణ రంగుల్లో ప్రకాశించింది. ప్రపంచంలోని సహజ అద్భుతాలు’ గా పిలువబడే నయాగర జలపాతం కెనడాలో ఒక ప్రసిద్ధ మైలురాయిగా చెప్పవచ్చు.

కరోనా వైరస్ మహమ్మారి ఫలితంగా భారతదేశం ప్రస్తుతం కేసులు మరియు ప్రాణనష్టాల పెరుగుదలను ఎదుర్కొంటోంది. భారతదేశానికి సంఘీభావం తెలుపుతూ తాజాగా నయాగర జలపాతం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు నారింజ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో, భారత జెండా రంగులలో ప్రకాశించేలా చేసింది. #StayStrongIndia, అని నయాగ్రా పార్క్స్‌ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే నయాగరా జలపాతం లో భారత పతాకంలోని త్రివర్ణంతో అలరించిడం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా ప్రభుత్వం నయాగరా జలపాతాన్ని భారత పతాకంలోని త్రివర్ణంతో అలరించింది. అలా శనివారంనాడు పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న భారత్‌కు తనదైన సంఘీభావాన్ని ప్రకటించింది.