Begin typing your search above and press return to search.

'రాయ‌ల‌సీమ' ప‌నులు చేప‌ట్టొద్దు : కృష్ణా బోర్డుకి ఎన్జీటీ కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   16 Feb 2021 4:56 PM IST
రాయ‌ల‌సీమ ప‌నులు చేప‌ట్టొద్దు :  కృష్ణా బోర్డుకి  ఎన్జీటీ కీలక ఆదేశాలు
X
ఏపీ ప్రభుత్వం చేప‌ట్టిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ఎన్జీటీ(జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌) చెన్నై బెంచ్‌ లో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. తెలంగాణ వాసి గ‌వినోళ్ల శ్రీనివాస్ దాఖ‌లు చేసిన‌ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ ‌ను ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. ఈ పిటిష‌న్‌ ను విచారించిన ఎన్జీటీ.. ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు చేప‌ట్టొద్ద‌ని పున‌రుద్ఘాటించింది. ప‌నులు జ‌రుపుతున్నారంటూ ఎన్జీటీకి పిటిష‌న‌ర్ తెల‌ప‌డంతో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండా ముందుకెళ్లొద్ద‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

దీనిపై స‌మాధానం ఇవ్వాల‌ని కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నుల‌పై నిజ‌నిర్ధ‌ర‌ణ‌కు క‌మిటీ వేయాల‌ని పిటిష‌న‌ర్ కోరాడు. తెలంగాణ విన‌తిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు ఎన్జీటీ వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర జలసంఘం మొట్టికాయలు వేసిన విష‌యం తెలిసిందే.
ఏపీ సర్కారు సమర్పించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో అసలు ప్రాథమిక అంశాలే లేవని.. కేంద్ర జల్‌శక్తి శాఖ మండిపడింది. ఇప్పటికైనా సీడబ్ల్యూసీ వెబ్ ‌సైట్‌ లోని మార్గదర్శకాలను పాటిస్తూ డీపీఆర్‌ ను మళ్లీ రూపొందించి సమర్పించాలని గ‌తంలో ఆదేశించిన విషయం తెలిసిందే.