Begin typing your search above and press return to search.

25కోట్ల విలువైన పుస్తకాన్ని చూశారా?

By:  Tupaki Desk   |   19 Dec 2016 12:20 PM GMT
25కోట్ల విలువైన పుస్తకాన్ని చూశారా?
X
ఒక పుస్తకానికి వేలంద్వారా దక్కిన ధర చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ స్థాయిలో ఆ పుస్తకానికి విలువ దక్కింది.. ఎందుకంటే ఆ పుస్తకానిని, ఆ పుస్తకంరాసిన వ్యక్తికి ఒక విలువుంది, చరిత్ర ఉంది. ఇంతకూ ఆ పుస్తకం ఏమిటి.. ఎవరు ఆ రచయిత.. ఎంత ధర అనేదే కదా మీ ప్రశ్న? ఆ పుస్తకం పేరు "ప్రిన్సిపియా మాథమాటికా". ఈ పేరు చదవగానే చాలా మందికి అర్ధం అయిపోయి ఉంటుంది.. ఇది సర్ ఐజాక్ న్యూటన్ రాసిన పుస్తకమని. అవును ప్రఖ్యాత భౌతిక - గణిత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ 1686 లో రాసిన ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైపోయిన విజ్ఞాన శాస్త్ర గ్రంథంగా రికార్డులు సృష్టించింది.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మూడు చలన సిద్ధాంతాలను సమగ్రంగా వివరిస్తూ న్యూటన్ రాసిన ఈ పుస్తకం వేలంలో భారీగా 37 లక్షల అమెరికా డాలర్లకు (దాదాపు 25 కోట్ల రూపాయలకు) అమ్ముడు పోయింది. పేరు ప్రకటించని ఒక బిడ్డర్ వేలం నిర్వాహకుల అంచనాల కంటే సుమారు నాలుగు రెట్ల అధిక మొత్తాన్ని వెచ్చించి 37,19,500 అమెరికా డాలర్లకు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ప్రపంచం గతిని సమూలంగా మార్చేసిన న్యూటన్ మూడు చలన సిద్ధాంతాలకు సంబందించిన సమగ్ర వివరణతో కూడిన పుస్తకం కావడంతోనే దీనికి ఆ బిడ్డర్ ఈస్థాయి విలువ ఇచ్చి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మేక చర్మంతో రూపొందించిన కవర్‌ ను కలిగివున్న ఈ పుస్తకాన్ని వేలానికి పెట్టిన ప్రముఖ సంస్థ "క్రిస్టీ". 252 పేజీలు ఉన్న ఈ పుస్తకం 9 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పుతో ఉంది. కాగా ఈ పుస్తకానికి 10 నుంచి 15 లక్షల డాలర్ల ధర లభిస్తుందని క్రిస్టీ సంస్థ భావించగా ఆ సంస్థ అంచనాలు తారుమారయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/