వీళ్లకి.. వైసీపీ ఏమైనా ఫర్వాలేదా? ఎందుకింత మౌనం!?

Thu Sep 29 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

news on ycp leaders

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్టీఆర్ అభిమానులు.. ఆయన తీసుకువచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. గతంలో టీడీపీలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరంతా ఏమైపోయారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. వైఎస్సార్ పేరు పెట్టడమే కాదు.. ఆ తర్వాత.. కూడా ఎన్టీఆర్ కేంద్రంగా అనేక రాజకీయ వాదనలు తెరమీదికి వచ్చాయి.  ఎన్టీఆర్‌ను చేతకాని నాయకుడంటూ.. మంత్రి రాజా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ డాక్టర్ కాదుకదా.. ఆయన యాక్టర్ అని.. మంత్రి విడదల రజనీ.. వంటివారు వ్యాఖ్యానించారు. ఇక క్షేత్రస్థాయిలోనూ.. అనేక మంది నాయకులు ఎన్టీఆర్ కేంద్రంగా విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీని ఎన్టీఆర్ ధ్వేషిగా చూస్తున్న జనాలు పెరుగుతున్నారు. ఇది ఆ పార్టీకి ఫుల్లు మైనస్‌గా మారిపోయింది. నిజానికి జిల్లా పేరు పెట్టారనే.. వాదన పక్కకు పోయింది.

ఎన్టీఆర్‌ను అవమానిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిణామాలపై కీలకమైన నాయకులు.. ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్‌తో చనువు ఉన్న నాయకులు.. స్పందించి.. ప్రజల్లో వైసీపీకి వస్తున్న వ్యతిరేతకను అరికట్టేందుకు ప్రయత్నించాలి కదా.. కానీ ఆదిశగా ఇప్పటి వరక ఎలాంటి చర్య లూ తీసుకోలేదు. పోనీ.. ఎన్టీఆర్‌కు అనుకూలంగా కాకపోయినా.. వైసీపీకి అనుకూలంగా అయినా.. ముందుకు తీసుకువెళ్లాలి కదా!

అది కూడా చేయడం లేదు. అంటే.. వారంతా.. వైసీపీ ఏమై పోయినా.. ఫర్వాలేదు అనుకుంటున్నారా?  లేక.. అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇలాంటి సీనియ ర్లకు.. ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఒకరిద్దరు తప్ప.. మిగిలిన నాయకులకు.. ప్రాధాన్యమే లేదు. సో.. వారంతా.. ఈ పరిణామాలు గుర్తుంచుకొని.. ఏమైనా అయితే..కానీ అని అనుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.