Begin typing your search above and press return to search.

గాజువాక వైపు మంత్రి గారి చూపు...తిప్పలేనా...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 10:00 PM IST
గాజువాక వైపు మంత్రి గారి చూపు...తిప్పలేనా...?
X
పాపం ఆయనకు ఇపుడు సీటు సమస్య వచ్చిపడింది. ఆయన మూడున్నర పదుల ఏజ్ లోనే మంత్రి అయిపోయారు. కీలకమైన శాఖలను కూడా చూస్తున్నారు. ఇంకా ఎంతో భవిష్యత్తు రాజకీయంగా ఉంది. కానీ సొంత సీటు అంటూ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడమే పక్క జిల్లాలో చేశారు. విశాఖలోని గాజువాకకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ అనకాపల్లి నుంచే 2014 ఎన్నికల ద్వారా రాజకీయ యుద్ధం చేస్తూ వస్తున్నారు.

ఆయన వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్ లో గెలిచారు. అయితే 2024లో మళ్ళీ అనకాపల్లి అంటే అసలు కుదిరేట్టుగా సీన్ లేదు. ఎందుకంటే ఆయన పక్కా నాన్ లోకల్ అని ప్రచారం సాగుతోంది.

దాంతో ఆయన వేరే సీటు నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే సెర్చ్ మొదలెట్టారు. మధ్యలో ఎలమంచిలిని కూడా టచ్ చేయాలని చూస్తే అక్కడ సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజు నుంచి అటాక్ మొదలైందని టాక్. ఇక తన తండ్రి, తాత పోటీ చేసి గెలిచిన పెందుర్తి నుంచి పోటీ చేసి బరిలోకి దిగుతామని అనుకుంటే అక్కడ ఉన్న యువ ఎమ్మెల్యే అదీప్ రాజ్ హై కమాండ్
కి దీని మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు.

ఇక అక్కడ కూడా యువ మంత్రికి లోకల్ గా వ్యతిరేకత ఉందని తేలడంతో ఇపుడు చూపు గాజువాక మీద పెట్టారని అంటున్నారు. నిజానికి ఆయన సొంత ప్రాంతం ఇదే. అయితే ఇక్కడ తిప్పల ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2006 నుంచి గట్టిగా పాతుకుపోయారు. 2009 నుంచి వరసగా మూడు సార్లు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ఆయనను గెలుపు వరించింది.

ఈసారి ఆయన తాను కానీ తన వారసులు కానీ ఇదే సీటు నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో ఉరమని ఉరుములా మంత్రి గారు ఈ సీటు మీద కన్నేశారు అని తెలియడంతో తిప్పల వర్గంలో అలజడి రేగింది అని అంటున్నారు. అయినా సరే జగన్ వద్ద ఉన్న తమ సాన్నిహిత్యంతో సీటు తమకే అని వారు భరోసాగా ఉన్నారట.

అయితే ఇక్కడ పోటీకి మంత్రి గారి లెక్కలు వేరుగా ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఆయన సామాజికవర్గం ఎక్కువగా ఉంది. దాంతో పాటు తన సొంత ప్రాంతమని చూపించబోతున్నారు. అదే విధంగా తిప్పల వయసుని కూడా ముందు పెట్టి టికెట్ అడుగుతారు అని అంటున్నారు.

అయితే తాను కాకపోతే తన వారసులకే టికెట్ ఇవ్వాలని తిప్పల వారి నుంచి డిమాండ్ వస్తోందిట. మరి ఇలా మూడు సీట్లను చూసుకున్నా ఎక్కడా ఈ యువ మంత్రికి పోటీ చేసే సీటు అన్నది కన్ఫర్మ్ కాలేదు. మరి సీటే చూసుకోకపోతే జగన్ మాత్రం ఏం చేయగలరు అని అంటున్నారు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో గుడివాడ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది ఆయన అనుచరులను వేధిస్తున్న ప్రశ్న.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.