Begin typing your search above and press return to search.
విన్నపాలు వినవలె: ఇక్కడొద్దు సార్.. అక్కడకు వెళ్తా.. మాజీ మంత్రి
By: Tupaki Desk | 30 Dec 2022 8:00 AM ISTటీడీపీలో కొందరు నాయకులు .. చంద్రబాబుకు విన్నపాలపై విన్నపాలు చేస్తున్నారు. నియోజకవర్గాలు మారుతామని కొందరు.. ఇప్పుడున్న నియోజకవర్గంవద్దు వేరే చోటకు వెళ్తామని మరికొందరు ఇలా.. తమ తమ అభిప్రాయాలతోవిన్నపాలు పంపుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మాజీ మంత్రి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కూడా చేరిపోయారు.
రెడ్డి సామాజికవర్తానికి చెందిన పల్లె పుట్టపర్తి నుంచి గత 2014 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. 2019కి వచ్చేసరికి ఆయన అసలు పోటీ చేయనని చెప్పారు. తనను రాజ్యసభకు పంపాలని కోరుకున్నారు. కానీ, ఎందుకో చంద్రబాబు ఆయననే బరిలో దింపారు. దీంతో ఓడిపోయారు. ఇక, ఇప్పుడు పరిస్థితి ఏమైనా మెరుపు పడిందా? అంటే.. పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటారు కదా! అలా ఉంది!!
ఒకవైపు..సొంత కేడర్ పట్టించుకోవడంలేదు. మరోవైపు జేసీ బ్రదర్స్ పుట్టపర్తిని టార్గెట్ చేశారు. దీంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో టికెట్‌నుత మవారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాదని.. బాబు పల్లెకు టికెట్ ఇస్తే..తామే ఓడిస్తామని.. ఇటీవల జేసీ బ్రదర్‌ప్రభాకర్ రెడ్డి పంచ్ డైలాగ్ వేసేశారు. దీంతో పల్లె ఇప్పుడు ఎందుకీ తలనొప్పి అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన నాకీ తలనొప్పి వద్దు.. వచ్చే ఎన్నికల్లో అసలు సీటు కూడా వద్దు.. ప్రభుత్వం రాగానే నన్ను రాజ్యసభకు పంపించేయండి మహప్రభో.. అని వేడుకుంటున్నారట. దీనిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే..జేసీల హవా మరింత పెరిగితే.. అది పార్టీకే ప్రమాదమని భావిస్తున్నారట. మరి పల్లె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.