Begin typing your search above and press return to search.

లోకేష్ అక్కడ నంబర్ వన్... ఫుల్ హ్యాపీయేనా...?

By:  Tupaki Desk   |   15 Aug 2022 11:30 PM GMT
లోకేష్ అక్కడ నంబర్ వన్... ఫుల్ హ్యాపీయేనా...?
X
తెలుగుదేశం పార్టీ భావి వారసుడు, చంద్రబాబు తరువాత అంతటి వారు అయిన నారా లోకేష్ అన్నిటా అగ్రగామి కావాలని తమ్ముళ్ళు ఎపుడూ కోరుకుంటారు. కానీ ఆయన మాత్రం ఈ రోజుకీ తండ్రి చాటు బిడ్డగానే ఉంటున్నారు. గతం కంటే బాగా మెరుగు అని లోకేష్ అనిపించుకున్నా ఇంకా ఆయన పొలిటికల్ గా బాగా గట్టిపడాల్సి ఉందని అంటారు.

ఇదిలా ఉంటే ఈ రోజుకీ టీడీపీకి ఫేస్ ఫోకస్ అన్నీ చంద్రబాబే. అలా 2024 ఎన్నికల భారాన్ని చంద్రబాబే మోస్తున్నారు. మరో వైపు శాసనమండలిలో లోకేష్ యువ నేతగా ఉన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి దాకా ఉంది అంటే మాజీ కావడానికి ఇంకా ఏడు నెలలు గడువు ఉంది.

ఆ మధ్యన మూడు రాజధానుల బిల్లుల విషయంలో మండలిలో కాస్తా అలజడి టీడీపీ చేసినపుడు లోకేష్ కొంత వెలుగులోకి వచ్చారు. అయితే ఆ తరువాత మాత్రం అక్కడ రాజకీయ మెరుపులు ఏవీ లేవు. బయట సభలలో లోకేష్ మాట్లాడుతున్నా పెద్దగా ఇంపాక్ట్ రావడంలేదు. ఇవన్నీ పక్కన పెడితే పెద్దల సభలే లోకేష్ అసలైన పెద్దన్నగా మారారు అని ఒక నివేదిక రావడం మాత్రం ఆసక్తిని రేపుతోంది.

ఇంతకీ లోకేష్ మండలిలో నంబర్ వన్ ఎలా అవగలిగారు, ఆయన ఏ విషయంలో నంబర్ వన్ గా ఉన్నారు అన్నదాని మీద ఆరా తీస్తే ఏపీ శాసన మండలిలో అందరి కంటే అత్యంత ధనవంతుడు మన లోకేష్ బాబే అని ఒక నివేదిక తేల్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రూ.369.27 కోట్ల ఆస్తులతో అంధ్రప్రదేశ్ లోనే అత్యధిక ఆస్తులు ఉన్న టాప్ లెవెల్ ఎమ్మెల్సీగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ నివేదిక తెలిపింది.

ఇది నిజంగా తమ్ముళ్ళు హ్యాపీగా ఫీల్ అవాల్సిన వార్తేనా అంట అది వారి ఇష్టం. కానీ లోకేష్ కుబేరుడు అని ఆ నివేదిక చెబుతోంది మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వారిలో లోకేష్ టాప్ ర్యాంక్ ని తీసుకోవడం అంటే రికార్డే కదా. అయితే లోకేష్ తో పాటుగా మరో పది మంది దాకా ఎమ్మెల్సీలు ధనవంతులు ఉన్నారట. అయినా చినబాబు క్రేజే వేరు అక్కడ. ఆయనను దాటి ఎవరూ ముందుకు పోలేదుట. సో దటీజ్ చినబాబు.

అయితే ఈ నంబర్ వన్ పొజిషన్ కంటే పొలిటికల్ గా లోకేష్ బాబు నంబర్ వన్ అవడమే తమకు కావాలని తమ్ముళ్లు ఆశిస్తే తప్పు లేదు, పొరపాటు అంతకంటే కాదు, కానీ ఆ దిశగా చినబాబు దూకుడు పెంచుతారా. వెయిట్ అండ్ సీ.