Begin typing your search above and press return to search.

స‌త్తా చాట‌లేక పోతున్న సీనియ‌ర్ మంత్రి.. రీజ‌నేంటి..?

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 AM GMT
స‌త్తా చాట‌లేక పోతున్న సీనియ‌ర్ మంత్రి.. రీజ‌నేంటి..?
X
ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు.. వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు వేయ‌గ‌ల దిట్ట‌. పైగా మంత్రిగా కూడా ఆయ‌న సీనియ‌ర్‌. గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేశారు . ఈ అనుభ‌వాన్ని రంగ‌రించి.. ప్ర‌స్తుతం త‌న‌కు.. ప్ర‌బుత్వాని కి ఆయ‌న మంచి పేరు తెస్తార‌ని.. ఆశించిన వారికి తీవ్ర నిరాశే వ్య‌క్తం అవుతోంది. ఆయ‌నే.. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. గ‌త ఉమ్మ‌డి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా ప‌నిచేసిన ధ‌ర్మాన మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న చిన్న వివాదాలు కామ‌నే అయినా..ఆయ‌న‌కు మంచి పేరుంది.

చ‌క్క‌ని నిర్ణ‌యాలు.. ప్ర‌జ‌ల‌కుసేవ‌లు అందించ‌డంలో రెవెన్యూ శాఖ‌ను ఆయ‌న మ‌రింత చేరువ చేశారు. మ‌రీ ముఖ్యంగా అవినీతి విష‌యంలో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు అప్పుడు కూడా తీసుకున్నారు. దీంతో ధ ర్మాన ఫీల్ గుడ్ మినిస్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఆయన ప‌రిస్థితి ఏంటి? అంటే.. ఏమీ చేయలేని ప‌రిస్థితిలో ఉండ‌డ‌మే. ఆయ‌న‌కు ఎన్నో చేయాల‌ని ఉంది. కానీ, ఏమీ చేయ‌లేక పోతున్నా ర‌ని ఆయ‌నే చెబుతున్నారు.

వాస్త‌వానికి వ‌చ్చీరాగానే.. ఆయ‌న కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రెవెన్యూలో అవినీతి పెరిగిపోయిం దని.. ఇక నుంచైనా.. ప్ర‌జ‌ల‌కు బాధ్య‌తాయుత‌మైన సేవ‌లు అంద‌జేద్దామ‌ని.. చెప్పుకొచ్చారు. ఇవి వివాద మయ్యాయి.

ఆ త‌ర్వాత కూడా అధికారుల విష‌యంలో ఆయ‌న‌చేసిన వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిం ది. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ధ‌ర్మాన ఎక్క‌డా నోరు విప్ప‌డం లేదు. త‌న మానాన త‌ను చేసుకు పోతున్నారు. అయితే.. త‌న‌దైన శైలిలో మాత్రం ఆయ‌న ముద్ర వేయ‌లేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్న‌ప్పుడు.. మేధావులు సైతం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కీల‌క‌మైన నాయ‌కుడికి మంచి ప‌ద‌వి ద‌క్కింద‌ని చెప్పుకొచ్చారు.కానీ ఆయ‌న మాత్రం ఎక్క‌డా త‌న‌దైన శైలిలో ముందుకు సాగ‌డం లేదు. ఎక్క‌డా కూడా త‌న‌దైన మార్కును చూపించ‌లేక పోతున్నారు. దీంతో ధ‌ర్మాన ప్ర‌సాదరావు.. విష‌యం ఆస‌క్తిగా మారింది. కేవ‌లం గుంపులో గోవిందా అన్న‌ట్టుగా ఆయ‌న క‌లిసి పోయారా? అని నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.