Begin typing your search above and press return to search.

పార్టీ వ‌ద్దు.. ప‌ద‌వి కావాలె.. కోమ‌టిరెడ్డి.. కుప్పిగంతులు!

By:  Tupaki Desk   |   4 Aug 2022 7:29 PM IST
పార్టీ వ‌ద్దు..  ప‌ద‌వి కావాలె.. కోమ‌టిరెడ్డి.. కుప్పిగంతులు!
X
రాజ‌కీయాల్లో స‌వాళ్లు చేయొచ్చు.. ప్ర‌తిస‌వాళ్లు కూడా చేయొచ్చు. కానీ, వాటిని నిలబెట్టుకోవాలి.. క‌దా! అది క‌దా.. నిజ‌మైన నాయ‌కుడంటే. తాను నిజ‌మైన నాయ‌కుడిన‌ని.. నిఖార్స‌యిన‌.. నేత‌న‌ని.. ప‌దే ప‌దే చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌.. అస‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. పైకి మాత్రం మాట‌ల తూటాలు పేల్చిన ఆయ‌న వాస్త‌వంలోకి వ‌చ్చేస‌రికి.. క‌క్క‌లేని.. మింగ‌లే ని ప‌రిస్తితిని ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ముందేమో.. ఇంకేముంది.. కాంగ్రెస్ పార్టీకి.. తన ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్నాన‌ని.. కోమ టిరెడ్డి ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో రేవంత్‌పైనా.. ఇత‌ర నేత‌ల‌పైనా.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, ఇంకేముంది.. రెండు రోజుల్లో ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఇంకేముంది.. రెడ్డిగారు పౌరుషానికైనా ప‌ద‌వికి రిజైన్ చేస్తార‌ని.. కాబ‌ట్టి ఉప ఎన్నిక‌ఖాయ‌మ‌ని.. పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా కూడా వేడెక్కింది.

ఇక‌, అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మునుగోడు రాజ‌కీయం గ‌రంగ‌రంగా మారిపోయింది. కానీ, ఇప్ప టికి మూడో రోజు వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.. రాజ‌గోపాల్ రాజీనామా ఊసే ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ఆయ‌న ఇప్పుడు అస‌లురాజీనామా చేసే యోచ‌న‌లో కూడా లేన‌ట్టు ఆయ‌న అనుచ‌రులే లీకులు ఇస్తున్నారు. త‌న రాజీనామా ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌..ఆయ‌న చేయించుకున్న స‌ర్వేలో.. త‌నకు వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని.. ఆయ‌న స‌మాచారం అందింద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా.. ఎమ్మెల్యేగా మాత్రం కొన‌సాగాల‌ని.. రాజ‌గోపాల్‌రెడ్డి నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి మ‌త్ర‌మే రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను ఏకంగా.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. 30 ఏళ్ల‌పాటు పార్టీకి సేవ‌చేశాన‌ని.. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డాన‌ని.. ఆయ‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగున్నా.. ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం కోమ‌టిరెడ్డి రాజీనామా చేసే ప‌రిస్థితి లేన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.