Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డికి భారీ ఊరట... అవన్నీ వట్టివేనట...
By: Tupaki Desk | 1 Nov 2022 11:00 PM ISTఆయన వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు ఒక ఏడాది లోగా తెలంగాణలో ఉంటాయనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను తీసుకునివచ్చారు. ఒక విధంగా ఆయన తెలంగాణా రాజకీయం మొత్తాన్ని ఎన్నికల వైపుగా లాగారు. ఆయనే కాంగ్రెస్ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ రోజు బీజేపీ అభ్యర్ధిగా మునుగోడులో పోరాడుతున్న అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇలాంటి నేపధ్యంలో అసలే హీటెక్కి ఉన్న తెలంగాణా రాజకీయం కాస్తా ఇపుడు మండు వేసవిని తలపిస్తోంది. మొత్తానికి వారిని వీరు వీరిని వారూ ఆరోపణలు చేసుకున్నారు.
ఇంకా అవినీతి మీద కూడా బురద జల్లుకున్నారు. ఈ నేపధ్యంలో కోమటిరెడ్డి రాజగోల్ రెడ్డి మీద టీయారెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. లెక్కలు లేని మొత్తం 5.24 కోట్లు ఉప ఎన్నికల నేపధ్యంలో బదిలీ అయిందని దాని మీద విచారణ జరపాలని కోరింది.
ఇంత పెద్ద ఎత్తున తీసిన నగదుని ఎన్నికల వేళ కోమటి రెడ్డి ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకే ఉపయోగించడానికి అని కూడా ఆరోపించింది. దాంతో ఈసీ కోమటిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఆ మొత్తానికి లెక్క చెప్పాలని కూడా అదేశించింది.
మొత్తానికి కోమటిరెడ్డి టెన్షన్ లో పడ్డారు. దీని మీద కోమటిరెడ్డి ఈసీకి వివరణ ఇచ్చారు. తన దగ్గర ఉన్న మొత్తం గురించి ఆయన తెలియచేశారు. మొత్తానికి కోమటిరెడ్డి ఇచ్చిన వివరణతో ఈసీ పూర్తిగా సంతృప్తి చెందింది. దాంతో ఆయన మీద వచ్చిన ఫిర్యాదులకు ఏ ఆధారాలు లేవంటి క్లీన్ చీట్ ఇచ్చేసింది. కొద్ది గంటలలో ఉప ఎన్నికల సమరం మొదలవుతున్న వేళ కోమటిరెడ్డికి ఇది బిగ్ రిలీఫ్ అని అంటున్నారు. సో ఈ విధంగా ఆయనకు టెన్షన్ కొంత తగ్గిందని కూడా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.