Begin typing your search above and press return to search.

అక్కడ పవన్ పీట వేసుకుని కూర్చుంటారుట... ?

By:  Tupaki Desk   |   27 Oct 2022 11:00 PM IST
అక్కడ పవన్  పీట వేసుకుని కూర్చుంటారుట... ?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న డౌట్లు అందరికీ ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి అలాగే విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారు. దానికి కారణం ఆనాడు జగన్ వేవ్ బలంగా ఉండడం, జనసేన సొంతంగా పోటీ చేయడం వల్ల ఒటమి తప్పింది కాదు. అయితే ఈసారి సీన్ అలా ఉండదనే అంటున్నారు.

ఈ మూడున్నరేళ్ల కాలంలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అదే టైం లో వైసీపీ పట్ల జనాలలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. ఇక టీడీపీతో పొత్తు ఉంటే కనుక పవన్ జనసేన వీర విహారమే చేస్తుంది అని అంటున్నారు. ఈ లెక్కలు అన్నీ ఎలా ఉన్నా గత అనుభవాల దృష్ట్యా పవన్ ఆచీ తూచీ పోటీ చేసే సీటుని ఎంచుకోవాలని చూస్తున్నారుట.

ఆయన ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని పోటీకి దిగాలనుకుంటున్నారుట. పొత్తులు ఉనన లేకపోయినా కూడా తన విజయం నల్లేరు మీద నడకలా సాగిపోవాలన్నది పవన్ పొలిటికల్ స్ట్రాటజీగా ఉంది. ఈసారి ఏపీ అంతటా పవన్ తిరిగి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. దాంతో తాను పోటీ చేసే సీట్లు డ్యాం ష్యూర్ గా గెలుపు గ్యారంటీ అని భావించి నామినేషన్ వేస్తే తాను మొత్తం ప్రచారాన్ని నిబ్బరంగా నిర్వహించుకోవచ్చు అన్నదే ఆలోచనగా ఉంది అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ పోటీ చేయడానికి చాలా సీట్లు రెడీగా ఉన్నాయి. మళ్లీ గాజువాకలో ఆయన పోటీకి దిగినా ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అదే టైం లో భీమవరం నుంచి మళ్ళీ ఆఫర్లు ఉన్నాయి. ఇక తిరుపతి నుంచి కూడా పోటీ చేయామని అక్కడ వారు కోరుతున్నారుట. అయితే పవన్ మాత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సీటు మీద ఎందుకంత మోజు అంటే అక్కడే అసలు కధ ఉంది అంటున్నారు.

ఈ సీట్లో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ శాతం ఉన్నారు. అది ప్లస్ పాయింట్. ఇక ఇక్కడ జనసేన గాలులు చాలా పెద్ద ఎత్తున వీస్తున్నాయి అని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు మీద వ్యతిరేకత పీక్స్ లో ఉంది. దాంతో పాటు ఇక్కడ జనసేన సంస్థగతంగా స్ట్రాంగ్ గా ఉంది. 2019 ఎన్నికలనే తీసుకుంటే జగన్ వేవ్ లో కూడా పెద్దగా పరిచయం లేని శేషుకుమారిని పోటీకి దించితే ఆమే ఏకంగా 28 వేల పై చిలుకు ఓట్లను సాధించారు. దాంతో ఇపుడు పవన్ లాంటి అధినేతే నేత నేరుగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం ఖాయమని అంటున్నారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి ప్రజారాజయం పార్టీ తరఫున వంగా గీత గెలిచారు.

అలా మెగా ఫ్యామిలీకి దన్నుగా ఈ సీటు ఉంది. దాంతో పవన్ పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. పొత్తులు కనుక కుదిరితే ఆ పార్టీ ఓట్లు కూడా అదనపు బలం అవుతాయని పవన్ లెక్కలేస్తున్నారుట. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో పోలైన టోటల్ ఓట్లలో తొంబై శాతం పైగా కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అంటే అక్కడ జనసేన అధినేత పీట వేసుకుని కూర్చుంటారన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.